నాగార్జున-అమల మధ్య వున్న బంధం అలాంటిది… ఇచ్చిన మాటకోసం నాగ్ యేమైనా చేస్తాడు!

నాగార్జున-అమల మధ్య వున్న బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరి మన్ననలను పొందాడు నాగార్జున‌. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాగార్జునదే. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది.

ఆరుపదుల వయసులో కూడా నాగ్ ఫిట్ నెస్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే కింగ్ నాగార్జున కేవలం సినిమాలకే పరిమితం అవలేదు. ఆ మధ్య ఓ ఛానెల్‌కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఇందులో బాడ్మింటన్ లీగ్, ఫుల్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు ఓనర్‌గా కూడా వ్యవహరించారు. నాగార్జునకు దాదాపు రూ. 1200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ సర్వే. అలాగే, దాదాపు 100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ 200 – 300 కోట్లు ఉంటుందట.

ఇక ఆ విషయం కాస్త పక్కన పెడితే, నాగార్జున ద‌గ్గ‌ర పెళ్లయిన కొత్తలో అమల ఓ మాట తీసుకుందట. ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. జంతు ప్రేమికురాలైన అమల తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుందట. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కు ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టిందట. ఆ కండీష‌న్‌కి అప్ప‌ట్లో ఓకే చెప్పిన నాగార్జున ఇప్ప‌టికీ కూడా త‌న సంపాద‌న‌లో కొంత జంతువుల సంరక్షణకు ఇస్తాడట. భార్యకు ఇచ్చిన మాటను నేటికీ నాగార్జున ఫాలో అవ్వడం నిజంగా సూపర్ కదూ!

Share post:

Latest