వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!

వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. ఆ తరువాత హైదరాబాదులోని ముప్పలేని శివ ను కలిసి విషయం చెప్పి తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని మంచి కథ కావాలన్నారు.

ఆ తర్వాత 1997లో వడ్డే నవీన్ హీరోగా ‘కోరుకున్న ప్రియుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం. ఆ సినిమా విజయం సాధించి, గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1997లోనే కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘పెళ్లి’ సినిమా వచ్చి వడ్డే నవీన్ లైఫ్ ను మార్చివేసిందని చెప్పవచ్చు. దాంతో అవకాశాలు బాగా పెరిగి దాదాపు 30 సినిమాలలో హీరోగా నటించడం జరిగింది. అయితే 2001 నుంచి వచ్చిన సినిమాలు అంతగా విజయం సాధించలేకపోయాయి. ఈ క్రమంలో ఈయన సినిమాలకు దూరం అయ్యారు.

అయితే దీనికి గల కారణాలు చాలమందికి తెలియదు. ఓ సమయంలో నవీన్ కి సినిమాలమీద పూర్తిగా ఆసక్తి పోయిందట. దాంతో అతను పూర్తిగా వ్యాపారాలమీద దృస్టి సారించడంతో మొత్తానికే సినిమా అవకాశాల డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఇకపోతే NTR కుమారుడైన రామకృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్న నవీన్ కొంతకాలం తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కూతురిని పెళ్లి చేసుకొని సెటిలైపోయినట్టు తెలుస్తుంది.

Share post:

Latest