బిగ్ రిస్క్ చేస్తున్న రవితేజ..ఇక అంతా భారం దేవుడి పైనే..!?

మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవ‌ల‌ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గ‌తేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు.
అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` ఒకపక్క షూటింగ్ జరుగుతోంది.

అలాగే సుధీర్ వ‌ర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న‌ విషయం తెలిసింది. రవితేజ 70వ సినిమాకి `రావణాసుర` అని టైటిల్‌ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే ఈ సినిమాలో రవితేజ లుక్స్ కూడా అలాగే ఉంటాయని తెలుస్తుంది. ఇకపోతే చిరంజీవి సినిమా `వాల్తేర్ వీరయ్య లో` రవితేజ ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నాడని సమాచారం.

ఇవన్నీ పక్కన పెడితే ఘట్టమనేని కార్తీక్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేసేటందుకు ఒప్పుకున్నాడట.
అయితే రవితేజ ఈ సినిమాలో తన రోల్ మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ తను టచ్ చేయని రోల్ అని తెలుస్తుంది. అయితే తన రోల్ మాత్రం ప్రేక్షకులకి ఓ మంచి షాకింగ్ లా ఉంటుందని అనుకుంటున్నారు.

ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం చేస్తారట. అయితే ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకుని వెంటవెంటనే చేస్తున్న హీరోలు ఇప్పుడు మ‌న టాలీవుడ్ లో లేరు ఒక్క రవితేజ తప్ప. అయితే ఈ సినిమాలన్నిటిలోనూ మంచి విజయం సాధించి సూపర్ హిట్ కొట్టాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Share post:

Latest