బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్లు రష్మికకు క్యూ కడుతున్నాయి. తాజాగా ఓ ప్రతిష్టాత్మక సినిమాకు ఆమె ఎంపికైంది. ఆషికీ-3లో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆషిఖీ-2లో శ్రద్ధా కపూర్-ఆదిత్య రాయ్ కపూర్ జోడీగా నటించారు. ఈ జోడీని మరిపించేలా కార్తీక్ ఆర్యన్ సరసన చక్కటి హీరోయిన్‌ను ఎంపిక చేయాలని డైరెక్టర్ అనురాగ్ బసు, నిర్మాతలు తలంచారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో రష్మిక మందన్నాకు మంజి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో రష్మిక-కార్తీక్ ఇటీవల ఒక చాక్లెట్ బ్రాండ్ కోసం ఒక వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. వీక్షకులు వారి జోడీ బాగుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్-రష్మిక మందన్నా జోడీ వెండితెరపై ప్రేక్షకులకు నచ్చుతుందని అంతా భావిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌తో పాటు మరికొన్ని ఇతర ప్రాజెక్టులపై భట్‌లతో కలిసి పనిచేసిన అనురాగ్ బసు ఆషికీ 3కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆధునిక ప్రేక్షకుల కోసం అతను ఎలాంటి ప్రేమకథను రూపొందిస్తాడో ఆసక్తికరంగా ఉంది. ఇక ఇటీవల తామిద్దరం జోడీ కట్టనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక గురించి కార్తీక్ ఆర్యన్ పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంటను పెద్ద స్క్రీన్‌పై కలిసి చూడాలని తమ కోరికను వ్యక్తం చేశారు. చాలా మంది నెటిజన్లు కార్తిక్ – రష్మిక కెమిస్ట్రీ బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share post:

Latest