రానా త‌మ్ముడు సినిమా టైటిల్‌… రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సురేష్ బాబు తనయుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో రానా జాతీయవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో భ‌ల్లాలదేవుడుగా రానా నటనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి రాణా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

When will Abhiram Daggubati acting debut happen? Here's the Answer

అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందే హాట్ న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో బాగా వార్తల్లో నిలిచాడు. ఇక సంచలన సినిమాల‌ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్న అభిరామ్ తొలి సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అహింస అనే టైటిల్ ఖరారు చేశారు. అహింస పూర్తి ప్రేమ కథ సినిమాగా తెర‌కేక్కినట్టు తెలుస్తోంది.

Rana Daggubati's brother Abhiram to make acting debut with 'Ahimsa' | see  poster | Celebrities News – India TV

అయితే తాజాగా దర్శకుడు తేజ‌ క్యాంపు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అహింస సినిమాను సెప్టెంబర్ 30న భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అహింస సినిమాలో త‌మిళ‌ నటుడు సముద్రకని ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అభిరామ్ లవర్ బాయ్ పాత్రతో పాటు యాక్షన్ లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.

Teja to launch Suresh Babu's younger son Abhiram – Telugu Nestam

Share post:

Latest