ఆ హీరోయిన్ మోజులో భార్య సుమ‌కు చుక్క‌లు చూపించి టార్చ‌ర్ పెట్టిన రాజీవ్‌…!

యాంకర్ సుమ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా సుమ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన మాటలతో సమయానికి తగ్గట్టు పంచులు వేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో సుమ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఏ సినిమా ఈవెంట్ జరిగినా, ఫ్రీ రిలీజ్ వేడుక జరిగినా, అవార్డు ఫంక్షన్ జరిగినా.. అక్కడ సుమ గొంతు తప్పనిసరిగా వినిపించాల్సిందే.


`
సుమ కేవలం యాంకర్ గానే కాకుండా ఇటీవల పలు సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల విడుదలైన `జయమ్మ పంచాయతీ` అనే సినిమాలో ప్రముఖ కీలక పాత్ర చేసింది. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా మనందరికీ తెలిసిన వ్యక్తి.. రాజీవ్‌ ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందారు. రాజీవ్ కనకాల – సుమ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఆదర్శ దంపతులుగా ఉంటారు.

కానీ కొన్ని రోజుల క్రితం సుమ – రాజీవ్ కనకాల ఇద్దరు విడిపోతున్నారంటూ విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై సుమ ఒక ఇంటర్వ్యూలో మేమిద్దరం విడిపోవాలి అనుకుంటున్నాం… కానీ మా పిల్లల ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మా ఆలోచనలు మార్చుకున్నాం… అంటూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇక అసలు వీరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏమిటంటే.. రాజీవ్ కనకాల ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడమే అన్న గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

రాజీవ్ కనకాల ఆ హీరోయిన్ తో ఒక సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రాజీవ్ కనకాలకు మాత్రం ఆ హీరోయిన్ పై మోజు త‌గ్గ‌లేదు . ఇక ఆ హీరోయిన్ కారణంగా సుమకి రాజీవ్ కనకాల చుక్కలు చూపించాడు.. అంటూ సినీ ఇండస్ట్రీలో చాలా గుసగుసలు అయితే వినిపించాయి. ఇక సుమ రాజీవ్ కనకాల టార్చర్ తట్టుకోలేక తన బంధువులకి ఈ విషయం చెప్పి తనదైన శైలిలో తన భర్తకు బుద్ధి చెప్పి తన దారికి తెచ్చుకుందని వార్తలైతే వచ్చాయి. ఇప్పటికీ కూడా వారి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి.

Share post:

Latest