ప్రకాశంలో టీడీపీ సిట్టింగులకు నో డౌట్?

ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే…రాజకీయ పార్టీలు ఎన్నికలు దిశగానే రాజకీయం నడిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మధ్యలో జనసేన కొంత ప్రభావం చూపాలని చూస్తుంది. అయితే అన్నీ జిల్లాల్లో వైసీపీ-టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది.

ఇక ఇప్పటికే రెండు పార్టీలు అభ్యర్ధులని కూడా ఇప్పటినుంచే ఖరారు చేసుకుంటూ వెళుతున్న పరిస్తితి ఉంది. ఇలా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఇదే సమయంలో పలు సర్వేలు కూడా బయటకొస్తున్నాయి. కొన్ని సర్వేల్లో వైసీపీ గెలుస్తుందని, కొన్ని సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తెలుస్తోంది. అయితే తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో టీడీపీకే అధికారం దక్కవచ్చని తేలింది. ఇది ఇప్పుడున్న పరిస్తితుల్లో. కానీ ఇది నిజం అవ్వోచ్చు…లేదా వైసీపీ మళ్ళీ గెలవవచ్చు.

కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అయితే ఆత్మసాక్షి సర్వే ప్రకారం…దాదాపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. ఏదో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన సిట్టింగులు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇందులో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో ముగ్గురు మిగిలారు.

ఈ ముగ్గురు ప్రజల్లోనే ఉంటున్నారు…వీరు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పెద్దగా పుంజుకోలేదని తెలుస్తోంది. దీంతో మళ్ళీ ముగ్గురు సిట్టింగులు గెలుస్తారని సర్వేలో తేలింది. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో బాలవీరాంజనేయస్వామి మళ్ళీ గెలుస్తారని సర్వేలో తెలిసింది. ఈ మూడే కాకుండా ప్రకాశంలో టీడీపీ…దర్శి, ఒంగోలు, సంతనూతలపాడు, కనిగిరి సీట్లని గెలుచుకోవచ్చని చెప్పింది. అటు వైసీపీకి వచ్చి…మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, చీరాల సీట్లు గెలుస్తుందని, కందుకూరులో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది.