మా ఎలక్షన్లో పోటీపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ఈయన తన విలక్షణమైన నటనలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. రంగస్థలం నుటుడు గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆరు భాషలలో సైతం 200 కు పైగా సినిమాలలో నటించారు. మొదటిసారిగా డైరెక్టర్ బాల చందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ సినిమా ద్వారా నటుడుగా గుర్తింపు సంపాదించారు. దాదాపుగా అన్ని భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించారు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు.

All winners from Prakash Raj panel resigns, no split in MAA- Cinema express

ఇక తెలుగులోకి మాత్రం హాయ్ అనే సినిమా ద్వారా మొదటిసారిగా ప్రకాష్ రాజ్ పరిచయమయ్యారు. ఇక ఒకానొక సమయంలో హీరోల కంటే ప్రకాష్ రాజ్ కి ఖాళీ డేట్స్ లేకుండా ఉండేవట. 2021లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి.. మా ఎన్నికలలో మంచు విష్ణుతో పోటీపడ్డారు ప్రకాష్ రాజు. అయితే ఆ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడం జరిగిందో వాటి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.

After the words war, MAA Elections takes place tomorrow

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్.. ఆ యాంకర్ ఇలా ప్రశ్న వేయగా మీరు ఎందుకు మా ఎన్నికలలో పోటీ చేయాలనుకున్నారు అని అడగగా.. అందుకు ప్రకాష్ రాజ్ నేను రెండు సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నాను మా అసోసియేషన్ లో ఏదో లోపం కనిపించింది.. అయితే అందులో ఉన్నవారు సరిగ్గా చేయలేదని చెప్పలేను.. కానీ నిర్ణయాలు మారాలనిపించింది అందుచేతనే అప్పుడు అందరితో మాట్లాడితే మీరు చెప్పేది కరెక్టే..కానీ మీరు నిలబడరు కదా అని అన్నారట.. అయితే అందుకు ప్రకాష్ రాజ్ నేను వస్తే మీరు గెలిపిస్తారా అని అడిగితే.. తప్పకుండా అనడంతో మా ఎన్నికలలో పోటీ చేశానని తెలిపారు. కానీ అప్పుడే నువ్వు నాన్ లోకల్, హిందూ ద్వేషివి ఇలాంటి వాదనాలతో ఆ ఎన్నికలను పొలిటికల్ కలర్ వేశారని చెప్పాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నేను ఒకటే చెబుతున్న ఎవరు ముఖ్యం కాదు నువ్వు ఏం చేస్తావు అన్నది చూడాలి అని తెలిపారు.

Share post:

Latest