ఆ సినిమా కోసం అనుష్కనే రిజెక్ట్ చేసిన ప్రభాస్..స్వీటి పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి వచ్చిన ఆఫర్ మరో హీరోయిన్ దక్కించుకోవడం సర్వసాధారణం. కానీ ఇలా చాలా ఎక్కువ జరగడానికి కారణం వాళ్ల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడమే. వాళ్ళు ఆ టైంకి వేరే సినిమాకి కమిట్ అయి ఉంటే తమ వద్దకు వచ్చిన మంచి సినిమాలను కూడా వదులుకోవాలి . ఇలా ప్రతి హీరోయిన్ కి ఎదురవుతూనే ఉంటుంది. కానీ చాలా రేర్ కండిషన్స్ లోనే ఒక హీరోయిన్ ని హీరో రిజెక్ట్ చేస్తారు . అలా అనుష్క ను రిజెక్ట్ చేసారు హీరో ప్రభాస్ . అలా చేసి అనుష్కకు మంచి పనే చేసాడు . అది ఎలా అంటారా.. ఇది చదవండి మీకు అర్థమవుతుంది.


తెరపై ప్రభాస్, అనుష్కను చూడడానికి అభిమానులు ఇష్టపడుతుంటారు. ఇద్దరు వేరే వేరే సినిమాలు నటిస్తేనే ఆ సినిమాలకు బీభత్సమైన క్రేజ్ తీసుకొస్తారు. అలాంటిది ఇద్దరు కలిసి తెరపై నటించాల్సి వస్తే అబ్బో.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ చేసే వరకు నిద్రపోరు జనాలు/ అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ వీళ్లది. కానీ 2012లో రిలీజ్ అయిన ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రెబల్ కోసం మాత్రం ప్రభాస్.. అనుష్క ను హీరోయిన్ గా వద్దనడం అప్పట్లో సంచలనంగా మారింది.

సినిమా రిజల్ట్ ముందే గెస్ చేసాడో ఏమో ప్రభాస్.. అందుకే అనుష్కను ఈ సినిమా నుంచి తప్పించాడు అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. రెబల్ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా రికార్డు దక్కించుకుంది. ఈ సినిమాను ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడా అంటూ ఫ్యాన్స్ అప్పుడు తలలు పట్టుకున్నారు. అంత చెత్త రికార్డు సంపాదించుకుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా తమన్నా రెండో హీరోయిన్ గా దీక్ష సేథ్ నటించారు. ఇద్దరు హీరోయిన్లకి ఈ సినిమా లాస్ నే మిగిల్చింది.

అయితే రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా అనుష్కని పెట్టాలనుకున్నారట. కానీ ప్రభాస్ ఆ రోల్ కి స్వీటీ కరెక్ట్ కాదు..అస్సలు సెట్ అవ్వదు అంటూ ఆమెను ఈ పాత్ర నుంచి రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం తమన్న ని అప్రోచ్ అవడం.. ఆమె ఓకే చెప్పడం ..సినిమా షూటింగ్ టకటక ఫినిష్ చేయడం ..రిలీజ్ చేయడం అట్టర్ ప్లాప్ అవడం అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి .అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఆమెను రిజెక్ట్ చేయడంతో స్వీటీ మొదట్లో బాధపడిందట .

ఆ తర్వాత సినిమా రిసల్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అయిందట . నేను ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నాను.. సేఫ్ జోన్ లో ఉన్నాను అంటూ సంతోష పడిందట . అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి వీళ్ళిద్దరూ మిర్చి సినిమాలో జంటగా కనిపించి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. అలా ప్రభాస్ అనుష్కను రిజెక్ట్ చేసి మంచి పనే చేశాడు అంటున్నారు ఫ్యాన్స్.

Share post:

Latest