అరాచకం సృష్టిస్తున్న పొన్నియన్ సెల్వన్ మూవీ ట్రైలర్..!

తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. అలాంటి చిత్రాలలో ఎన్నో అద్భుతమైన కథలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. అలా బాహుబలి, RRR, సైరా నరసింహారెడ్డి, తదితర సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ మణిరత్నం కూడా ఒక భారీ హిస్టారికల్ సినిమాని తెరకెక్కించారు ఆ చిత్రమే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజున చెన్నైలో చాలా గ్రాండ్గా విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.Ponniyin Selvan 1: Will Aishwarya Rai, Vikram's film make an impact on the silver-screen? Watch its trailerఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా కథ రాజ్యాధికారం కోసం కిరీటం కోసం పోరాడుతున్న చోళ రాజ్యం యొక్క కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో విక్రమ్ ఆదిత్య కరికాలన్ గా నటించగా.. కార్తీ యోధ యువరాజుగా నటించారు, ఐశ్వర్యరాయ్ రాణి నందినిగా నటించారు, ఇక త్రిష మాత్రం చోళ యువరాణి కుందవై పాత్రలో నటించారు. ఇక జయం రవి పొన్నియన్ సెల్వం పాత్రను అద్భుతంగా పోషించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు మణిరత్నం టచ్ ప్రతి ఫ్రేమ్ లో కూడా కనిపిస్తోంది. కాస్త ఆలస్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన ట్రైలర్ బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.Aishwarya Rai Bachchan Starrer Mani Ratnam Ponniyin Selvan Part One Trailer Launch | Ponniyin Selvan Trailer: Aishwarya Rai की फिल्म पोन्नियिन सेलवन का ट्रेलर हुआ लॉन्च, सिंहासन के लिए होगा ...

ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన అన్ని భాషలలో ఒకేసారి విడుదల కానుంది. పొన్నియన్ సెల్వన్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాలలోనే మూడు లక్షల వ్యూస్ ను అందుకుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే తెలుగులో దగ్గుపాటి రానా, తమిళంలో నటుడు కమలహాసన్, మలయాళం లో పృథ్వీరాజ్ సుకుమారన్, హిందీలో అనిల్ కపూర్ వాయిస్ ,కన్నడలో జయంత్ కైకిని వాయిస్ ఓవర్ తో విడుదల చేశారు ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

 

Share post:

Latest