పేర్ని వారసుడుకు షాక్..జగన్ ఫిక్స్..!

వచ్చే ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని..కొడుకులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నేతల వారసులు ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉంటే..వారి బాధ్యతలని తనయులు చూసుకుంటున్నారు.

ఇక మాజీ మంత్రి పేర్ని నాని  వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) సైతం..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ షాడో ఎమ్మెల్యేగా కిట్టు పనిచేస్తున్నారు. అయితే ఇలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయిస్తున్న కిట్టుపై విమర్శలు కూడా వచ్చాయి..అలాగే తండ్రి బదులు పనిచేస్తున్నారని ప్రశంసలు వచ్చాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పేర్ని వారసుడు రెడీ అయిపోయారు.

 

ఆ మధ్య బందరులో జరిగిన ప్లీనరీ సమావేశంలో నెక్స్ట్ బందరులో పోటీ చేసేది కిట్టు అని చెప్పి కొడాలి నాని ప్రకటించారు. పేర్ని నాని సైతం..ఇక తాను విశ్రాంతి తీసుకుంటానని, తన వారసుడు పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ క్రమాంలోనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా కిట్టు పాల్గొంటున్నారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వైసీపీ వర్క్ షాప్ జరిగింది…అందులో గడపగడపకు వెళ్లని వారి పేర్లని జగన్ చెప్పారని తెలిసింది. అందులో పేర్ని నాని పేరు కూడా ఉందని తెలిసింది. అయితే తాను నెక్స్ట్ పోటీ చేయనని, తన కుమారుడు పోటీ చేస్తాడని, తన వారసుడు గడపగడపకు వెళుతున్నారని పేర్ని..జగన్‌కు చెప్పారు.

అయితే వారసులు గడపకు తిరిగితే కౌంట్ చేయమని, ఎమ్మెల్యేలే తిరగాలని, అలాగే మీ వారసుడుకే కాదు..ఏ వారసుడుకు కూడా సీటు ఇవ్వనని, మీరే తనతో పనిచేయాలని చెప్పి పేర్నికి జగన్ సూచించినట్లు తెలిసింది. దీని బట్టి చూస్తే నెక్స్ట్ పేర్ని వారసుడు పోటీకి జగన్ బ్రేకు వేసినట్లే.

Share post:

Latest