ప‌వ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడా… ఆ సంఘ‌ట‌న వెన‌క స్టోరీ ఇదే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందు నుంచే పవన్ బర్త్ డే వేడుకలు ఎక్కడిక‌క్కడ షురూ అయిపోయాయి. ఇక గత రాత్రి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు… హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు… అటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జల్సా రిలీజ్ ప్రీమియర్ షోలు వేశారు.

ఈ ప్రీమియర్ షోలలో పవన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తన పుట్టినరోజు సందర్భంగా పవన్ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి తీపి గుర్తులతో పాటు ఎవరికీ తెలియని చాలా విషయాలు సైతం పవన్ బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు చదువు పెద్దగా వచ్చేది కాదని.. ఎనిమిదో తరగతి నుంచి పరీక్షల్లో తప్పటం అలవాటు కావడంతో ఇంటర్ ఫెయిల్ అయినా తాను బాధపడలేదని చెప్పారు. ఇంత జరుగుతున్న తనను ఎప్పుడూ అమ్మానాన్న ఒక్క మాట కూడా అనలేదని… అయితే తన జీవితంలో సక్సెస్ కాలేనేమో అన్న అపరాధ భావంతో ఉండేవాడిని అని ప‌వ‌న్ తెలిపాడు.

తన స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారు.. తాను మాత్రం ఉన్నచోటే ఉంటున్నాను అన్న బాధ తనను ఎప్పుడూ వెంటాడేద‌ని పవన్ చెప్పారు. ఆ సమయంలో ఒత్తిడిలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని నాటి విషయాన్ని బయట పెట్టారు. అయితే కుటుంబ సభ్యులు చూడటం వల్ల తాను బతికి బయటపడ్డానని.. అప్పుడు ఇద్దరు అన్నయ్యలతో పాటు సురేఖ వదిన తనకు అండగా నిలిచారని… నువ్వు చదివినా చదవకపోయినా మేము ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటామని చెప్పారన్నాడు. జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ముందుగా నిర్ణయించుకోమని వారు సలహా ఇచ్చారని ప‌వ‌న్ గుర్తు చేసుకున్నాడు.

Share post:

Latest