ధర్మాన బ్రదర్స్‌కు పవన్ ప్లస్?

గత ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా 151 సీట్లు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి.  టీడీపీపై వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్..జగన్‌పై సానుభూతి,…అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఓట్లు చీల్చడం. జనసేన ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పొచ్చు. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యేది ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.

అయితే గత ఎన్నికల్లో పవన్ వల్ల సేఫ్ గా బయటపడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు…నెక్స్ట్ గాని పవన్, టీడీపీతో కలిస్తే తమ పరిస్తితి ఏంటి అని భయపడుతున్నారు. నెక్స్ట్ టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు రిస్క్‌లో పడ్డట్టే. అలా కాకుండా విడిగా పోటీ చేస్తే చాలామంది ఎమ్మెల్యేలు సేఫ్ అవుతారు.

అలా సేఫ్ అయ్యేవారిలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కూడా ఉంటారు. ఎందుకంటే  గత ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీలో ధర్మాన…టీడీపీపై 5,777 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ అక్కడ జనసేనకు పడిన ఓట్లు 7,557 ఓట్లు. అంటే అప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే ధర్మానకు గెలుపు కష్టమయ్యేది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మాన గెలుపుకు పవన్ ప్లస్ అవ్వాలి. ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేస్తేనే ధర్మాన గెలుస్తారని తాజాగా ఆత్మసాక్షి సర్వేలో తేలింది.

అలా కాకుండా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ధర్మానకు రిస్క్. అటు ధర్మాన సోదరుడు, మాజీ మంత్రి కృష్ణదాస్‌కు కూడా నర్సన్నపేటలో టఫ్ ఫైట్ ఉందట. ఇప్పటికే అక్కడ టీడీపీ పుంజుకుంది..కానీ 2-3 శాతం ఓట్ల తేడాతో కృష్ణదాస్ ఎడ్జ్‌లో ఉన్నారట. ఇలాంటి పరిస్తితుల్లో టీడీపీ-జనసేన కలిసి బరిలో ఉంటే కృష్ణదాస్‌కు కూడా రిస్క్. మొత్తానికి పవన్ టీడీపీతో కలిస్తే ధర్మాన బ్రదర్స్‌కు రిస్క్…విడిగా పోటీ చేస్తే సేఫ్.

Share post:

Latest