డేంజర్‌ జోన్‌లో పరిటాల ఫ్యామిలీ..!

రాష్ట్ర రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు…ఎన్నో ఏళ్ల నుంచి అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ ముఖ్య పాత్ర పోషిస్తుంది…టీడీపీకి అండగా ఉంటూ వస్తుంది. అయితే పరిటాల రవి ఉన్నంత కాలం తిరుగులేకుండా ఉంది…ఆయన తర్వాత కూడా సునీతమ్మ సత్తా చాటుతూ వచ్చారు. కానీ పరిటాల వారసుడుగా పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాక…పరిటాల ఫ్యామిలీ రాజకీయంగా సత్తా చాటలేకపోతుంది. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. రాప్తాడు బరిలో దిగి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇక ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ రాప్తాడులో సత్తా చాటాలనే దిశగా పనిచేస్తున్నారు. మధ్యలో ధర్మవరం బాధ్యతలు కూడా రావడంతో…ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అయితే రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. శ్రీరామ్ అదేవిధంగా రాజకీయం చేస్తున్నారు. సరే రెండు సీట్లు వస్తే పరిటాల ఫ్యామిలీ నెగ్గుకు రాగలదా? అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో కష్టమని తేలింది. తాజాగా  వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని తేలింది. అయితే జిల్లా మొత్తం మీద సర్వే జరగగా, ఇప్పుడున్న పరిస్తితుల్లో జిల్లాలో 7 సీట్లు టీడీపీ, 6 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని, ఒక సీటులో పోటాపోటీ ఉందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది.

టీడీపీ గెలుచుకునే సీట్లు… హిందూపురం, తాడిపత్రి, అనంతపురం అర్బన్, శింగనమల, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ.

వైసీపీ గెలుచుకునే సీట్లు…ధర్మవరం, రాప్తాడు, రాయదుర్గం, గుంతకల్, మడకశిర, పుట్టపర్తి.

ఇక టఫ్ ఫైట్ నడిచే సీటు ఉరవకొండ అని సర్వేలో తేలింది. అంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉన్నారు…నెక్స్ట్ ఈయన టఫ్ ఫైట్ ఎదురుకోవాలని తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడు కాస్త ఎడ్జ్‌లో టీడీపీనే ఉందట. అయితే పరిటాల ఫ్యామిలీకి చెందిన రెండు సీట్లు వైసీపీ గెలుచుకోనుంది. అటు సీనియర్ నేతలు కాల్వ శ్రీనివాసులు ఉన్న రాయదుర్గం, పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్న పుట్టపర్తి కూడా పోతాయని చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడున్న పరిస్తితుల్లో మరి ఎన్నికలనాటికి ఏమైనా పరిస్తితి మారుతుందేమో చూడాలి.

Share post:

Latest