మ‌ళ్లీ పైసా వ‌సూల్ కాంబినేష‌న్‌… ఈ సారి ట్విస్ట్ ఏంటంటే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరో గా వచ్చిన బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగిస్తూ ఉన్నారు. యువ హీరోలకు పోటీగా నిలుస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా లాభాలను అందిస్తున్నారు. బాలయ్య బాబు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పక్క యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య దాదాపుగా తన తదుపరిచిత్రాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నది.

After 'Paisa Vasool', Balakrishna to team up with Puri Jagannadh again |  The News Minuteడైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. లైగర్ సినిమా ఫ్లాప్ తో ప్రస్తుతం తన తదుపరిచిత్రం పైన ఫోకస్ పెట్టి హీరోల కోసం వెతుకుతున్న సమయంలో బాలయ్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఒక స్టోరీని బాలకృష్ణకు చెప్పగా అందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా #NBK-107 సినిమాలో నటిస్తున్నది. ఇక వచ్చే నెల నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాను కూడా బాలయ్య స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో కూడా మరొకసారి బాలయ్య ఫ్యాక్షనిస్టుగా ఈ గొడవల వల్ల బాలయ్య 14 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపి బయటికి వచ్చిన తర్వాత తన జీవితంలో చోటుచేసుకుని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పూరి జగన్నాథ్ కాంబినేషన్ కోసం బాలయ్య అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో పైసా వసూల్ సినిమా రావడం జరిగింది. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా బాలయ్య నటన మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఆ సమయంలోనే బాలయ్యతో మరొక మూవీ తీస్తానని కూడా పూరి జగన్నాథ్ చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు మరొకసారి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై క్లారిటీ వస్తే బాగుంటుంది.

Share post:

Latest