మరొకసారి కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

హీరో సుధీర్ బాబు , కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈ సినిమాకి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మొదటిసారి కృతి శెట్టి డ్యూయల్ రోల్ లో నటించింది. అయితే కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగులుతున్నాయి అలా ది వారియర్ మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు డిజాస్టర్ గానే నిలిచాయి.

Actress Krithi Shetty Reveals Her Celebrity Crush, It's Sivakarthikeyan

అయితే ఆ అమ్మాయి గురించి ఈ సినిమా సక్సెస్ అవడం తనకి ఎంతో ప్రత్యేకమనీ కృతి శెట్టి తెలియజేస్తోంది. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర ఇది ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారని తెలియజేసింది. ఇక ఈ సినిమా చూసిన చాలామంది తనకు ఫోన్ చేసి తమని తాము స్క్రీన్ పైన చూసుకున్నట్లు ఉందని చెబుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందని.. ఒక నటిగా ఇంతకంటే కావాల్సింది ఏముంది అని ఎమోషనల్ అయ్యింది కృతి శెట్టి. ఇంత మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయం తనకు చాలా ప్రత్యేకమని తెలియజేసింది.

Krithi Shetty | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్‌లో  కృతి శెట్టి..

తాను నటించే ప్రతి సినిమానీ ఒక హోంవర్క్ లాగా చేస్తానని చెప్పుకొచ్చింది. పాత్రని వివరంగా రాసుకుంటానని అప్పుడు ఆ పాత్రని చేయడం చాలా సులువుగా ఉంటుంది అని తెలియజేసింది.సెట్ లో ఒక్కొక్క సీను జరుగుతున్నప్పుడు నిజంగానే అలాంటి సన్నివేశాలు తన జీవితంలో కూడా జరిగాయని చెప్పింది. ఇలా చేసినప్పుడు చాలా సహజమైన హావభావాలు పలుకుతూ ఉంటాయని తెలియజేసింది కృతి శెట్టి. అందుచేతనే ఈ పాత్రను చాలా సులువుగా చేశానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest