యంగ్ హీరో శర్వానంద్- అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? ఇదే క్రమంలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చాయో.. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తెస్తుందా లేదా నష్టాలే మిగిల్చిందా అనేది చూద్దాం..
ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఏరియాలో వైడ్ గా చూద్దాం..
నైజాం 0.92 కోట్లు
సీడెడ్ 0.59 కోట్లు
ఉత్తరాంధ్ర 0.42 కోట్లు
ఈస్ట్ 0.23 కోట్లు
వెస్ట్ 0.24 కోట్లు
గుంటూరు 0.22 కోట్లు
కృష్ణా 0.23 కోట్లు
నెల్లూరు 0.21 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ ఈ సినిమాకు 3.07 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. ఈ సినిమా 6.13 కోట్లు రాబట్టింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్లో ఈ సినిమా 0.70 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ గానూ 3.77 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 6.99 కోట్లను రాబట్టింది.
ఒకే ఒక జీవితంస సినిమా థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లు వరకు జరిగింది. ఇక, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈసినిమా సేఫ్ అయ్యే చ్యాన్స్ ఉంది. శర్వానంద్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ గత శర్వానంద్ సినిమాలు ప్లాప్ కావడంతో మార్కెట్ కించం తగ్గింది. ఐతే, ఈ సినిమాకి రివ్యూస్ పాజిటివ్ గా ఉండటంతో ఈ రోజు నుంచి ఈ సినిమాకి కలెక్షన్స్ పెరుగుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.