ఆ విషయంలో అరుదైన రికార్డును సృష్టించిన ఎన్టీఆర్.. స్టార్ హీరో కూడా దిగదుడుపే..!!

సకల గుణాభి రామ శ్రీరామ అన్నట్టుగా సద్గుణవంతుడు ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము అంటే ఇక ఆయన విధివిధానాలు జనాలకు ఎంత ఆదర్శమో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్టీఆర్ సినీ జీవితంలో ద్విపాత్రాభినయాలు, బహుముఖ పాత్రాభినయాలలో ఎన్టీఆర్ తనకు తానే సాటి.. మొదటి సారి 1964లో రాముడు – భీముడు సినిమా ద్వారా ద్విపాత్రాభినయం చేసిన ఆ తర్వాత , అదే ఏడాది అగ్గిపిడుగు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం వంటి సినిమాలలో రెండేసి పాత్రలు పోషించి రికార్డు నెలకొల్పారు.. ఇక ఆయన బహుముఖ పాత్రాభినయాలు చూస్తే గోపాలుడు – భూపాలుడు, మంగమ్మ శపథం, శ్రీకృష్ణ పాండవీయం, సర్దార్ పాపారాయుడు , కొండవీటి సింహం, విశ్వరూపం వంటి సినిమాలలో ద్విపాత్రాభినయం చేశారు.

N. T. Rama Rao | Sr NTR's birthday anniversary: A flashback of his film and  political foray
ఇకపోతే ఇప్పటివరకు ఏ హీరో కూడా చేయని సాహసం చేసి ఇక ఆ ఈ విషయంలో మాత్రం ఈయన తర్వాతే ఎవరైనా అని సాటి చెప్పారు. ఇక అలా కుల గౌరవం చిత్రంలో తాత , తండ్రి, కొడుకుగా మూడు పాత్రలు పోషించారు ఎన్టీఆర్. ఇక శ్రీకృష్ణసత్యలో రాముడు, కృష్ణుడు , రావణాసురుడిగా కూడా నటించి రక్తికట్టించారు. ఇక దానవీరశూరకర్ణ సినిమాలో శ్రీకృష్ణుడు , కర్ణుడి , దుర్యోధనుడి పాత్రలో కూడా పోషించి మెప్పించారు. ఇక శ్రీమద్విరాటపర్వం సినిమాలో ఏకంగా ఐదు పాత్రలో కనిపించడం విశేషం ఇక ఇలా ఎవరు కూడా ఇంతటి సాహసాన్ని చేసి ప్రేక్షకులను మెప్పించింది లేదు. అందుకే ఏదైనా పాత్ర వేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఎన్టీఆర్ గురించి మరికొన్ని విషయాలకొస్తే.. ఎన్టీఆర్ చదువుకునే రోజుల్లోనే కుటుంబ అవసరాల కోసం హోటల్స్ కి పాలు సరఫరా చేసేవారు . ఇక పాతాల భైరవి చిత్రంలో తన సహచరుడైన ఆ తరం నటుడు బాలకృష్ణ మద్యానికి బానిసైతే.. సినిమా షూటింగ్లకు ఆలస్యంగా వస్తున్నాడని , అతడిని చిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే ..అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని బాలకృష్ణను ఇంటికి పిలిపించి మరీ రామారావు మందలించారు. ఆ తర్వాత బాలకృష్ణ ఏ రోజు కూడా షూటింగుకి ఆలస్యంగా రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.