అతడి కోసం గొడవ పెట్టుకున్న ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన ధనరాజ్..!

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాల రామాయణం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రవేశం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్కు విపరీతమైన గుర్తింపు లభించింది. ఇక కేవలం సినిమాలలోనే కాదు బుల్లితెరపై పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారు ఎన్టీఆర్.Bigg Boss Telugu - double elimination: Dhanraj, Kathi Karthika evicted from  Jr NTR's show - IBTimes Indiaప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి వెల్లడించారు. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమయిన నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ వన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ధనరాజ్ వ్యవహరించారు. ఇలా ఉండగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హోస్ట్గా చేయడం వల్ల బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పటికీ ప్రత్యేకమే అని తెలిపారు. ఇక వారం రోజులపాటు హౌస్ లో ఎంత గొడవపడినా ఎన్టీఆర్ ని చూడగానే చాలా సంతోషం వేసేది. ఎన్టీఆర్ మందలించాల్సిన సమయంలో గట్టిగా మందలిస్తారు.. ప్రేమ చూపించాల్సిన సమయంలో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు అంటూ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.NTR who had a fight for Sampuranesh.. Dhanraj who told the real thing?

ఇక అంతే కాదు ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం గొడవ కూడా పెట్టుకున్నారని మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. సంపూర్ణేష్ బాబు పెరిగిన వాతావరణం బిగ్ బాస్ హౌస్ లో ఉండే వాతావరణానికి పూర్తిగా విరుద్ధం.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొద్ది రోజులకే సంపూర్ణేష్ బాబు అనారోగ్యం పాలవ్వడం తో ఆయనను బయటకు పంపించడం కోసం ఎన్టీఆర్ ఏకంగా నిర్వాహకులతో గొడవపడ్డారు. ఇక బయటకు పంపించాలంటే రూ. 25 లక్షలు చెల్లించాలని చెప్పడంతో..ఎన్టీఆర్ ఈ విషయంపై మాట్లాడుతూ తాను మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఇలా చేయకండి.. ఒకవేళ తాను బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా 25 లక్షల రూపాయలు చెల్లించాల్సివస్తే ఆ డబ్బులు నేను కడతాను అంటూ సంపూర్ణేష్ బాబుకి మద్దతుగా నిలబడ్డారు ఎన్టీఆర్ అంటూ ధనరాజ్ తెలిపారు. ఏది ఎవరక్కడ ఏమైనా ఎన్టీఆర్ మంచి మనస్తత్వానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

Share post:

Latest