ఎన్టీఆర్ ఏంటి… ఇంత‌లోనే అంత మార్పా…!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో త‌న నెక్ట్స్ సినిమాల విష‌యాలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న నెక్ట్స్‌ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రతి ఒక్క మూమెంట్ కూడా అద్భుతంగా ఉండాల‌నేలా ఆలోచిస్తున్నాడు. రాజమౌళి సక్సెస్ అందుకున్న తర్వాత ఏ హీరో అయినా సరే డిజాస్టర్ ఇస్తాడు అన్న బ్యాడ్ సెంటిమెంటు ఉంది. ఇది రామ్‌చ‌ర‌ణ్ కు ఆచార్యతో మరింత బలంగా మారిపోయింది.

దీంతో ఇప్పుడు కొర‌టాల డైరెక్ష‌న్‌లో తాను న‌టించే సినిమా విష‌యంలో ఎన్టీఆర్ కొంచెం కూడా రిస్కు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. కొరటాల శివ ఇప్పటికే ముందు అనుకున్న క‌థ‌ను ప‌క్క‌న పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కొత్త క‌థ పాన్ ఇండియా లెవ‌ల్లో రెడీ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా కొరటాల శివ కోసం సరికొత్త లుక్ లోకి మార‌నున్నాడు.

Home Minister Amit Shah meets Junior NTR in Hyderabad | The News Minute

గ‌తంలో జ‌నతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ ను చాలా సింపుల్‌గా చూపించాడు కొర‌టాల‌. ఆ సినిమాలో ఓ నేచుర‌ల్ ల‌వ‌ర్ లా ఎన్టీఆర్ క‌నిపించాడు. అయితే వ‌చ్చే సినిమాలో మాత్రం ఎన్టీఆర్ లుక్ కాస్త వైల్డ్ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ కాస్త బరువు తగ్గాడ‌ట‌. కొద్ది రోజుల క్రితం అమిత్ షాను క‌లిసి న‌ప్పుడు కాస్త చబ్బీగా కనిపించిన ఎన్టీఆర్ బ్ర‌హ్మాస్త ఈవెంట్‌లో కాస్త స‌న్న‌బడి నాజూగ్గా క‌నిపించాడు. ఏదేమైనా ఎన్టీఆర్ త‌క్కువ టైంలోనే స‌రికొత్త లుక్‌లోకి వ‌చ్చి అంద‌రిని ఆశ్చర్య ప‌రిచాడు.

Share post:

Latest