ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా.. దానికి ఒప్పుకోనంటున్న విష్ణు ప్రియ.. కారణం..!!

యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక తాజాగా బిగ్ బాస్ మానస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వీరి షూటింగ్ కి సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడం గమనార్హం. ఇక కొన్ని కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరించే అవకాశం అందుకుంటుంది. ఇక ఇటీవల సుడిగాలి సుదీర్ ,దీపికా పిల్లి నటీనటులుగా నటించిన వాంటెడ్ పండుగాడు సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

Anchor Vishnu Priya బ్లాక్ టాప్ లో రచ్చ.. కింద అలా వదిలేసి...ఇప్పుడు  జాగ్రత్త పడింది! - Telugu Filmibeat

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ కార్యక్రమమంటే నచ్చదని.. తనకా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినా సరే చస్తే వెళ్ళనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో తనకు నిర్వాహకులు ఎంత పారితోషకం ఇచ్చినా సరే అడుగుపెట్టను అని కూడా తెలిపింది.. ఇకపోతే తాను బిగ్ బాస్ కార్యక్రమాన్ని కూడా ఫాలో కాను అయితే ప్రస్తుతం ప్రసారమవుతున్నటువంటి సీజన్ సిక్స్ లో తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు అని అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేహా చౌదరికి తన మద్దతు తెలుపుతున్నానని తెలిపింది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లోకి .. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్  ఎంట్రీ.. !– News18 Telugu

ఇక బిగ్ బాస్ హౌస్ లో నేహా చౌదరికి సపోర్ట్ చేసింది.. బిగ్ బాస్ హౌస్ లో నేహా చౌదరి చాలా జెన్యూన్ గా గేమ్ ఆడుతున్నారని అయితే తనకు బయటకు నుంచి కావాల్సిన సపోర్టు నా నుంచి పూర్తిగా లభిస్తుందని కూడా తెలుస్తుంది. నేహా చౌదరి కి విష్ణు ప్రియ మద్దతు పలుకుతుండడంతో.. విష్ణు ప్రియ అభిమానులు కూడా నేహ చౌదరికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Share post:

Latest