సినిమా పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా బయట వారి కన్నా చాలా భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి చాలా వింతగా ఉంటుంది. ప్రధానంగా సినీ సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు వారి జీవన విధానం గురించి బయటి వారు చూస్తుంటే ఎంతో విడ్డూరంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే ఇప్పట్లో సర్వ సాధారణం. ఈ సందర్భంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల కుటుంబాలకు సంబంధించిన వారు రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలతో పిల్లలను కన్నారు. మరి వారు ఎవరో చూద్దాం.
శ్రీజ :
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తర్వాతి వారసుడిగా రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇదే క్రమంలో ఆయన కూతుర్లు కూడా ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా గడిపేస్తున్నారు. అయితే అయన రెండో కుమార్తె ఫ్యామిలీ లైప్‌లో అనుకోని సంఘటనలు ఉన్నాయి. శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ టైంలో ఈమె పెళ్లి ఎంతో సంచలనంగా మారిపోయింది. శిరీష్ భరద్వాజ్ తో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన వెంటనే భర్తకు విడాకులు ఇచ్చింది శ్రీజ. తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకుంది. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా మరో కుమార్తె పుట్టింది. ఇలా ఇద్దరు భర్తలతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
రాధిక శరత్ కుమార్ :
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ అప్పట్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఈమె తన కెరియర్ పరంగా ఎంత సక్సెస్ అయినా. ఫ్యామిలీ లైఫ్ లో ఈమె చాలా ఇబ్బందులు పడింది. ఈమె కెరియర్ పిక్స్‌లో ఉన్నప్పడు స్టార్ హీరోలతో ఎఫైర్లతో వార్తల్లోకి ఎక్కింది. ఈమె ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుంది. అయితే రెండవ భర్త ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చింది రాధిక. ఆ తర్వాత శరత్ కుమార్ తో ప్రేమలో పడి మళ్ళీ పెళ్లి చేసుకుని ఒక కొడుకుకి జన్మనిచ్చింది. ఇలా ఇద్దరు భర్తలతో పిల్లలకు జన్మనిచ్చింది.
సౌందర్య రజినీకాంత్ :
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్లు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. పెద్ద కుమార్తె సౌందర్య మొదటి భర్తతో కొంతకాలం కాపురం చేశాక… వీరికి ఒక కొడుకు జన్మించాడు. తర్వాత అనుకోని కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సౌందర్య ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఆ ఇద్దరికీ కూడా ఒక కొడుకు పుట్టాడు. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలతో ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది సౌందర్య.