కార్తికేయ సినిమాతో డబల్ రెమ్యూనరేషన్ పెంచేసిన నిఖిల్..!!

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రం కార్తికేయ -2 ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి మంచి హైట్ ని క్రియేట్ చేసుకుంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమా అనుకోని విజయంగా రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రేక్షకులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాని ప్రశంసించడం జరిగింది. కేవలం సౌత్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఊహించని విధంగా ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది.It's official now! Tollywood actor Nikhil Siddharth to enter Wedlockఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సాధించడంతో హీరో నిఖిల్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా యువ హీరోగా కూడా పేరు పొందాడు నిఖిల్. ఇక పలువురు నిర్మాతలు హీరో నిఖిల్ కు సినిమా కథలను వినిపించగా నిఖిల్ మాత్రం నిర్మాతలకు షాక్ ఇచ్చేలా తన రెమ్యూనరేషన్ భారీగా చెప్పడంతో ఒకసారిగా నిర్మాతలు షాక్ అవుతున్నారు. కార్తికేయ సినిమా కోసం నిఖిల్ దాదాపుగా రూ.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.Nikhil Siddhartha-Starrer 'Karthikeya 2' Crosses 100 Crore Markసినిమా కథను బట్టి ప్రస్తుతం తను ఒక్కో సినిమాకి రూ. 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఒకేసారి రెండింతల రెమ్యూనిరేషన్ పెంచడంతో నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో నిఖిల్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించడంతో మరికొంతమంది నిఖిల్ బ్రదర్ కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోండి అంటూ పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒక్క సినిమానే 100 కోట్లు రాబడితే ఇలా పెంచేస్తే చాలా కష్టమంటూ తెలియజేస్తున్నారు. మరి రెమ్యూనరేషన్ విషయంలో నిఖిల్ వెనకడుగు వేస్తారో లేదో చూడాలి.

Share post:

Latest