#NBK 107.. నాన్ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా..?

ఈమధ్య స్టార్ హీరోల చిత్రాలు రికార్డు స్థాయిలో బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా థియేట్రికల్ బిజినెస్ , నాన్ థియెట్రికల్ బిజినెస్ రైట్స్ పరంగా పలు రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల నాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ధరకే అమ్ముడుపోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఇదే తరహాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK -107 చిత్రానికి కూడా నాన్ థియేట్రీకల్ రైట్స్ విషయంలో పలు రికార్డులను సైతం సృష్టించినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

NBK107 Makers Deny Remake Rumors

బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో మంచి ఫామ్లకు వచ్చారని చెప్పవచ్చు. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచింది. ఈ సినిమా ఉత్సాహంతోనే బాలకృష్ణ తదుపరి సినిమాలని వరుస పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. అలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK -107 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నది. విలన్ పాత్రలో దునియా విజయ్ కూడా నటిస్తూ ఉన్నారు. ఒక కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తోంది.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఆ సన్నివేశాలను కూడా చిత్ర బృందం టర్కీలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా నాన్ థియేట్రీకల్ రైట్స్ దాదాపుగా రూ.60 కోట్ల రూపాయల వరకు డీల్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ స్థాయిలో బాలయ్య సినిమాకు రావడం ఇదే కెరియర్ లోనే మొదటిసారి. మరి భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఏడాది విడుదల కాబోతోంది.