ఆ హీరోయిన్ పేరు తో హద్దులు మీరిన ట్రోలింగ్..నాగచైతన్య సంచలన నిర్ణయం..!?

మనకు తెలిసిందే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది . ఎక్కువగా కనిపిస్తుంది కూడా.. సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా కానీ స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖ రాజకీయ నాయకులు ,,పేరు గల పెద్ద కుటుంబాల గురించిన వార్తలు క్షణాల్లో వైరల్ గా మారడమే కాదు.. ట్రౌలర్స్ మీన్స్ రూపంలో వాళ్లని ట్రోల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది.

ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత కామన్ గా అయిపోయిందో ..సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ని ట్రోల్ చేయడం అంత కామన్ అయిపోయింది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు గమనిస్తే వాటిలో టాప్ టెన్ ప్లేస్ లో ఉంది నాగచైతన్య పేరు . టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ఆయన తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంతకు విడాకులు ఇవ్వడం ఒక కారణమైతే.. మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రావడం మరో కారణం .

అంతే కాదు త్వరలోనే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్కినేని కాంపౌండ్ నుంచి లీక్ అవుతున్న సమాచారం ప్రకారం తనపై తప్పుడు వార్తలు రాసే వారిపై ..ట్రోలింగ్ చేసే వారిపై అక్కినేని ఫ్యామిలీ కఠిన యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓ టీంను ఏర్పాటు చేసి ఇలా ఎవరైతే నాగచైతన్య పేరును తప్పుగా వాడుతున్నారో వాళ్ళ అందరిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం . ట్రోలింగ్ విషయం పక్కన పెడితే నాగచైతన్య సినిమాల విషయం మాత్రం వెనకడుగు వేయట్లేదు.. వచ్చిన సినిమాలలో నచ్చిన స్టోరీస్ చేసుకుంటూ జనాలను మెప్పిస్తున్నాడు .

Share post:

Latest