ఆ హీరోయిన్‌తో నాగ‌చైత‌న్య ఎఫైర్ ఇంత సీక్రెట్‌గా న‌డుస్తోందా…!

అక్కినేని నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇటీవ‌ల‌ `థాంక్యూ`, `లాల్ సింగ్ చద్దా` సినిమాలతో థియేటర్లో తెగ హ‌డావిడి చేశారు. కానీ ఈ రెండు సినిమాలు హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో చైతన్య సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా నాగచైతన్య – సమంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.

అయితే గత ఏడాది విడాకులు తీసుకుని ప్రస్తుతానికి మాత్రం ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు బిజీగా ఉంటున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నుండి నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జంట విడాకులు తీసుకుని దాదాపు సంవత్సరం అవుతున్న వీరిపై వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వచ్చి హాట్ టాపిక్ గా మారుతుంది.

ప్రస్తుతం నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల‌తో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అసలు కథ ఏంటంటే శోభిత ధూళిపాళ్ల ప్రెజెంట్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన `పొన్నియన్ సెల్వన్-1`లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది‌. శోభిత ఈ సినిమాలో ఒక యువరాణి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమాలో వనిత ఆమె పాత్ర పేరు.

త‌న‌ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా దానికి నాగచైతన్య ఒక లైక్ కొట్టాడు. ఇంకేముంది నాగచైతన్య లైక్ చేసిన ఆమె పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. దీంతో మరొకసారి వీరిద్దరి మేటర్ సోషల్ మీడియాలో వైరల్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా నాగచైతన్య శోభిత మేజర్ సినిమా ప్రమోషన్స్ టైం లో ఒక హోటల్ లో సీక్రెట్ గా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో వీరిపై ర‌క‌ర‌కాల అనుమానాలు వ‌స్తున్నాయి.

Share post:

Latest