తెనాలిలోనే నాదెండ్ల..ఆలపాటి ఎటు?

జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ తెనాలిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. సరే నాదెండ్ల తెనాలిలో పోటీ చేస్తే టీడీపీలో కన్ఫ్యూజన్ ఎందుకని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలవు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి పొత్తుపై ఎలాంటి చర్చ లేదు గాని…ఎన్నికల ముందు మాత్రం అధికారికంగా పొత్తు తప్పనిసరిగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదని రెండు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తు లేకపోతే సీటు గురించి వచ్చే ఇబ్బంది లేదు. టీడీపీ-వైసీపీ-జనసేన మూడు పార్టీలు పోటీ చేస్తాయి. ఇక టీడీపీ-జనసేన మధ్య మళ్ళీ ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.

పొత్తు ఉంటే మాత్రం టీడీపీ-జనసేనలో ఎవరు పోటీ చేసిన గెలిచేస్తారు. కానీ ఇక్కడ పొత్తు ఉంటే ఎవరు పోటీ చేస్తారనేది చర్చ. ఇప్పటికే మళ్ళీ తెనాలిలో పోటీ చేస్తానని నాదెండ్ల చెప్పేశారు. మరి ఈ సీటు జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.

ఒకవేళ ఈయన్ని గాని వేరే సీటుకు పంపిస్తారా? లేక ఈ సీటు రాజాకు ఇచ్చి…నాదెండ్లని వేరే సీటుకు పంపిస్తారా? అనేది క్లారిటీ లేదు. నాదెండ్ల కాన్ఫిడెన్స్ చూస్తుంటే..ఆయన తెనాలి సీటులోనే బరిలో దిగేలా ఉన్నారు. మరి అలాంటప్పుడు రాజాని వేరే సీటుకు పంపించాలి. కొద్దో గొప్పో గుంటూరు వెస్ట్ సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది గాని…మిగిలిన సీట్లు ఖాళీ లేవు. మరి చూడాలి పొత్తు ఉంటే తెనాలి సీటు ఎవరికి దక్కుతుందో.