అభివృద్ధి అడిగితే అంతే… ఆ మంత్రి తీరు మార్చుకుంటారా…!

వైసీపీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు సెగ భారీగా తుగులుతోంది. ఆయ‌న ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్ర‌జ‌లు అభివృద్ధి ఏది మంత్రి వ‌ర్యా ? అని బాహాటంగానే ప్ర‌శ్ని స్తున్నారు. గ‌తంలో ప‌నులు చేసేందుకు, చేయించేందుకు.. అప్ప‌టి ఎమ్మెల్యే గౌతు శివాజీ.. ఒక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేవారు. వారిద్వారా.. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌నులు చేయించాలో ముందుగా నే ఒక జాబితా రెడీ చేసుకుని.. దానినిప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ? | AP Cabinet Expansion: seediri appalaraju and venugopalakrishna to sworn in on wednesday ...

దీంతో ప‌లాస ఇప్పుడున్న‌ట్టుగా అభివృద్ది అయింద‌ని అంటే.. అది పూర్తిగా గౌతు కుటుంబానికే చెందు తుంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ.. జ‌గ‌న్ ఇమేజ్‌తో విజ‌యం ద‌క్కించుకున్న సీదిరి చేసిం ది ఏంటి ? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. ఏమైనా మాట్లాడితే.. క‌రోనా స‌మ‌యంలో నువ్వు ప‌నిచేశావా ? అంటూ.. ఆయ‌న ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంకా ఏదైనా అంటే… కేసులు పెట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

AP minister Seediri Appalaraju slams Pawan Kalyan over remarks on Vizag steel plant issue

ఇక‌, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిపై ఆయ‌నకు అస‌లు సోయికూడా లేద‌ని.. అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ప‌లాస ప్ర‌జ‌లు విసుగు చెందుతున్నారు. ఇటీవ‌ల సీదిరి గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. రోడ్లు బాగా లేవ‌ని.. క‌నీసం.. పంపులు కూడా స‌రిగా రావ‌డం లేదని.. పింఛ‌న్లు కొంద‌రికే ఇస్తున్నార‌ని.. ఇలా.. ప్ర‌జ‌లు స‌మ‌స్య ల చిట్టాను విప్పారు.

దీనికి ఆయ‌న ఎలాంటి స‌మాధానం చెప్పుకుండా.. వెంట‌నే మీరు టీడీపీవోళ్లు క‌దా! అని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. నిజానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు.. ఎక్క‌డ చూసినా.. గోతులు ప‌డిన రోడ్లు.. అభివృద్ధిలేని ప‌రిస్థితి నెల కొంది. నియోజ‌క‌వ‌ర్గంలో ల‌బ్ధిదారులైన వారికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న‌న్న ఇళ్ల‌లో త‌ట్టెడు మట్టి కూడా పో యించ‌లేని ప‌రిస్థితి నెలకొంది.

Seediri Appala Raju | ElectWise

ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. వారిని ప్ర‌తిప‌క్షంఅంటూ.. వ్యాఖ్యానించ‌డం..వారికి పార్టీల‌ను అంట‌గ‌ట్ట‌డం త‌ప్ప‌.. సీదిరి చేస్తున్న రాజ‌కీయం ఇంత‌కు మించి ఏమీ క‌నిపించడం లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో సీదిరిపై ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. మ‌రి సీదిరి తీరు మారుతుందా ? లేదా ? చూడాలి.