పిచ్చెక్కించే కాంబో: ఆ కామెడీ డైరెక్టర్ తో బన్నీ సినిమా..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ప్రస్తుతం సార్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో బన్నీ నటన చూసిన జనాలు ఈ అబ్బాయి హీరోగా రాగలడా అని అనుకున్నాడు. అయితే ఆ మాటలని తిప్పి కొడుతూ బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు హీరోగా రావడమే కాదు సంచలన రికార్డును క్రియేట్ చేసి పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నాడు.

ప్రజెంట్ బన్నీ పేరు చెప్తే టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్ అల్లాడిపోతుంది. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాగా గత సంవత్సరం పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన బన్నీ మరికొద్ది రోజుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ లో భాగం కానున్నారు . అయితే ఈ సినిమాని పుష్ప 1 లా కాకుండా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 17 2022 కి విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ అది జరగని పని అని సినీ విశ్లేషకులు అంటున్నారు .

అయితే ఈ సినిమా అయిపోగానే బన్నీతన నెక్స్ట్ సినిమాని బిగ్ డైరెక్టర్ తో చేస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2అయిపోగానే బన్నీ ఒక కామెడీ డైరెక్టర్ తో మూడి నెలల ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి. బన్నీ ఈయన తో కేవలం మూడు నెలల్లో ఓ సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. నిజానికి అనిల్ రావిపూడి- బన్నీ కాంబో ఊహించుకుంటేనే జనాల నవ్వేస్తున్నారు. మరి అలాంటిది బన్నీ రేంజ్ కి అనిల్ రావిపూడి సెట్ అవుతాడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. మరి చూడాలి ఈ క్రేజీ రూమర్ లో ఎంత నిజం ఉందో..?

Share post:

Latest