జానీ మాస్టర్ భార్య ప్రాణాలు కాపాడిన మెగా హీరో.!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో జానీ మాస్టర్ కూడా ఒకరు. జానీ మాస్టర్ మెగా కుటుంబానికి పెద్ద అభిమాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో ఆదరిస్తూ ఉంటారు. అందుచేతనే మెగా హీరోల సినిమాలకు తప్పకుండా కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంటారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ తనకు చేసిన సహాయాన్ని గురించి జానీ మాస్టర్ ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది.

Jani Master turns actor : స్టెప్పులతో ఇరగ్గొట్టిన జానీ మాస్టర్..యాక్టింగ్‌తో  అదరగొడతాడా..? | Dance master jani to check his fate as an actor | TV9 Telugu
అయితే తాజాగా జానీ మాస్టర్ విషయంలో రామ్ చరణ్ చేసిన సహాయాన్ని ఒక డాన్స్ షోలో కంటిస్టెంట్ల పర్ఫామెన్స్ ని చూసి తెలియజేయడం జరిగింది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. జానీ మాస్టర్ భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆమెకు తీవ్రమైన ఇబ్బంది అని ఆ సమయంలో జానీ మాస్టర్ రామ్ చరణ్ గారి సహాయం కోసం ఫోన్ చేయక తను మౌనవ్రతంలో ఉన్నానని మెసేజ్ పెట్టారట. అయితే రామ్ చరణ్ మౌనవ్రతంలో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని చేరవలసిన చోటికి చేరవేసేలా చేశారని జానీ మాస్టర్ తెలియజేశారు.

Viral: Choreographer Jani Master In Ram Charan And Shankar Movie - Sakshi
అయితే తనకు ఆప్పటివరకు సహాయం చేసిన వారు ఎవరూ లేరని ఎంతో కుమిలిపోయానని అయితే హాస్పిటల్లో వైద్యులు తన భార్యకు సర్జరీ చేసి తన భార్య బిడ్డని కూడా క్షేమంగా కాపాడారని అయితే బిల్లు కట్టే సమయంలో కేవలం రూ. 350 రూపాయలు మాత్రమే కట్టమని అక్కడ వైద్య సిబ్బంది చెప్పడంతో జానీ మాస్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. అయితే అప్పటికే హాస్పిటల్ సిబ్బందికి ఉపాసన జానీ మాస్టర్ భార్యా హాస్పిటల్ బిల్లు మొత్తం చెల్లించిందని తెలియజేశారు. మెగా కుటుంబం సహాయం కోరి వస్తే ఖచ్చితంగా ఎవరిని నిరాశతో వెనక పంపించమని ఈ విధంగా తెలియజేశారు జానీ మాస్టర్.

Share post:

Latest