ఈ దెబ్బతో మెగా – అల్లు ఫ్యామిలీ విడిపోయినట్టేనా..?

చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు స్టూడియోలు పుట్టుకు రావడం జరిగింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియో.. దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి రామానాయుడు స్టూడియో, కృష్ణ ఫ్యామిలీ కి సంబంధించి పద్మాలయ స్టూడియో ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోలు పుట్టుకు రావడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ రెండు స్టూడియోలు మాత్రమే షూటింగ్లో బాగా కళకళలాడుతున్నాయి.

Allu Aravind sons: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కొడుకులన్న  సంగతి ఎంతమందికి తెలుసు..? | How many people know that Mega Producer Allu  Aravind had 4 sons along with Allu Venkat ...

అయితే అన్నపూర్ణ స్టూడియో విషయంలో మాత్రం ప్రస్తుతం ముందు వరుసలో నిలిచిందని చెప్పవచ్చు. ఆ తర్వాత రామానాయుడు స్టూడియో ఓపెనింగ్ లకు కొన్ని ఇండోర్ షూటింగులకు ప్రధానంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో మెగా కుటుంబం కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఎలాంటి ఫిలిం స్టూడియోను ఇప్పటివరకు నిర్మించలేదు. అయితే మెగా కుటుంబం మాత్రం ఫిలిం స్టూడియో అని అప్పట్లో నిర్మించాలని ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే వెలుబడలేదు. అయితే మెగా ఫ్యామిలీ చెందిన అల్లు వారి ఫ్యామిలీ మాత్రం తాజాగా ఫిలిం స్టూడియో అని నిర్మించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun : 'అల్లు' స్టూడియోస్‌ నిర్మాణం పూర్తి.. ఇనాగరేషన్ డేట్ ఫిక్స్
అల్లు స్టూడియోస్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అల్లు అరవింద్ కు చెందిన విశాలమైన స్థలంలో ఈ స్టూడియోను నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అధునాతన సాంకేతికాలతో ఈ స్టూడియోని తీసుకురాబోతున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ స్టూడియో నిర్మాణానికి సంబంధించి పలు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించిన అల్లు కుటుంబం వెంటనే స్టూడియో నిర్మాణాన్ని మొదలు పెట్టాలని..ఇప్పుడు పనులు ప్రారంభం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ స్టూడియో అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా కుటుంబం అలుక కుటుంబం వేరువేరుగా ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరియు ఈ విషయంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని మళ్లీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest