నందమూరి వారి ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం చాలా పెద్దదైన విషయం అందరికీ తెలిసిందే.. ఇక వీరి కుటుంబం నుంచి ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఫంక్షన్లకు నందమూరి కుటుంబం నుంచి దాదాపుగా అందరూ హాజరవుతూ ఉంటారు. అయితే కొన్ని ఫంక్షన్స్ కు మాత్రమే ఎన్టీఆర్ హాజరు కావడం తరచూ మనం చూస్తూనే ఉంటాము. అయితే తాజాగా నందమూరి వారి ఇంట్లో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.. అది కూడా నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది.

వైభవంగా జరిగిన నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ వివాహం

ఇక చైతన్య కృష్ణ వివాహానికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో మరొకసారి ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే కొంతమంది అభిమానుల సైతం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వీరు ఆహ్వానించలేదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ పెళ్లికి హాజరై కెమెరాల కంట పడలేదా అనేది కూడా ఇంకా తెలియడం లేదు మొత్తానికి జై కృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో ఎన్టీఆర్ హాజరు కాకపోవడం ప్రస్తుతం అభిమానులలో చర్చనీయాంశం గా మారుతోంది.

nandamuri chaitanya krishna marriage, ఘనంగా ఎన్టీఆర్ మనవడి పెళ్లి..  వైరల్‌గా మారిన ఫోటోలు - nandamuri chaitanya krishna marriage photos goes  viral - Samayam Telugu

ఒకవేళ చైతన్య కృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ ని ఆహ్వానించకుంటే.. నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని కావాలని దూరం పెడుతున్నట్లుగా భావించవచ్చని మరి కొంతమంది అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ ని చేరదీశారు కానీ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ ని అంతగా కలవడానికి ఇష్టం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై రాబోయే రోజులలోనైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Share post:

Latest