‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాత ఫొటోలు ఎపుడైనా చూశారా?

బాలీవుడ్ సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయ్యి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నటీమణులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడం మృణాల్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఈ క్రంమలోనే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండటం వలన ఆమెకి సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో మృణాల్ లుక్ ని చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అసలు గుర్తుపట్టలేని విధంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సదరు ఫోటోని చూసిన నెటిజన్లు కాస్త అసహనానికి గురవుతున్నారు. మరికొందరైతే ఆ ఫోటో ఆమెది కాదంటూ వాదిస్తున్నారు. మరికొందరు ఆమెకి స్కిన్ అలెర్జీ వచ్చిందని.. అందులో కమిలిపోయి నల్లగా కనిపిస్తుందని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు ఇది అసలు ఒరిజినల్ ఫొటో కాదని అంటున్నారు. ఇలాంటి అరుణంలో సదరు ఫొటో.. తనదో కాదో? అన్న సంగతి మృణాల్ చెబితేనే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి మృణాల్ లాంటి బ్యూటీని ఈ లుక్ లో చూసి తట్టుకోలేకపోతున్నారు ఆమె అభిమానులు. అవును, అప్పుడే ఆమె అభిమానులను పోగేసుకుంది మరి!

Share post:

Latest