ఆ బ్రాండ్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రామ్ చరణ్.. మరీ అన్ని కోట్లా?

మెగా వారసుడు హీరో రామ్ చరణ్ మంచి స్పీడుమీద వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో రామ్ చరణ్‌ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో RRRను వీక్షిస్తున్న హలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రామ్ చరణ్, NTRలకు సూపర్ క్రేజ్ వస్తోంది. ఇకపోతే రాంచరణ్ అభిమానులకు ఓ కిక్కిచ్చే వార్త ఒకటి తెలిసింది.

అదేమంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద బ్రాండ్‌పై సంతకం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హీరో మోటో కార్ప్‌కు చెందిన ఒక బైక్ బ్రాండ్‌‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. హీరో మోటో కార్ప్‌కు చెందిన గ్లామర్ బైక్‌కు ఆయన అంబాసిడర్‌గా ఉండనున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించన యాడ్ షూట్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతున్నట్టు భోగట్టా. ఈ రెండు నిమిషాల యాడ్‌కు ఆయన తీసుకుంది ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాలా 8 కోట్ల రూపాయిలు అతనికి ముట్టజెప్పిందట హీరో మోటో కార్ప్ కంపెనీ.

ఏంటి షాక్ తింటున్నారా? సాధారణంగా ఒక సినిమాకి తీసుకున్న మొత్తానికి ఇది సమానంగా ఉండటం గమనార్హం. ఇకపోతే RRR తర్వాత రామ్‌చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మరలా సెప్టెంబ‌ర్ 8 నుంచి వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనుంది. పొలిటికల్ థ్రిల్లర్‌‌గా వస్తోన్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా హిందీ భామ కియారా అద్వానీ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్ పలుకుతున్నట్టు తెలుస్తుంది.

Share post:

Latest