భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య ప‌క్క‌న దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.

పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నారు. 2023 సంక్రాంతి కానుకగా `ఆది పురుష్` సినిమా విడుదల కానుంది. కృతి సనన్ `ఆది పురుష్‌` సినిమాతో పాటు బాలీవుడ్లో కూడా మూడు ప్రాజెక్టులు చేస్తోంది. ఇదిలా ఉంటే కృతి సనన్ ముంబై జూహులో ఓ డైరెక్టర్ ఆఫీస్ కి వచ్చి వెళుతున్న దృశ్యాలు కెమెరామెన్ కంట పడ్డాయి.

దీంతో ఇక కృతి సనన్ అందాలు ఫోటోల్లో బంధించి ఆమె లేటెస్ట్ స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె తీయించుకున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఆన్ స్క్రీన్ ఏ కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా మెస్మరైజ్ చేస్తున్న కృతి సనన్ గ్లామరకు అందరూ ఫిదా అవుతున్నారు. ఆదిపురుష్ హీరోయిన్ అందాల ఆరబోత.. కృతి సనన్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest