కృష్ణ సోదరుడు గెలుపుతో బండ్ల గణేష్ కు ఓటమి..!!

టాలీవుడ్ లో ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రస్తుతం రసవత్తంగా మారుతూ ఉన్నాయి. మా ఎలక్షన్ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సాధారణ ఎన్నికల తరహాలో అభ్యర్థుల మధ్య హోరి పోరి జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదంతా ఇలా ఉండగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మరొక ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫిలింనగర్ కల్చర్ సెంటర్ ఎన్నికలు గత కొంతకాలంగా చాలా సైలెంట్ గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఫిలింనగర్ కల్వరల్ సెంటర్ అధ్యక్షుడిగా కృష్ణ సోదరుడు జి ఆది నాగేశ్వరరావు పోటీ చేశారు.

Vaartha Online Edition

హోరాహోరీగా సాగిన ఈ పోటీలో జి ఆదిశేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఉపాధ్యక్షుడిగా బరిలో దిగిన బండ్ల గణేష్ ఓటమి పాలయ్యారు. ఇక బండ్ల గణేష్ పై తుమ్మల రంగారావు ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. ఇక నిన్నటి రోజు నుంచి ఎన్నికలు హోరా హోరీగా ప్రారంభమయ్యాయి. ఇక అదే రోజున ఈ ఎన్నికలు పూర్తయి అయ్యాయి. అలా ఓట్లు లెక్కింపు తర్వాత రిటర్నింగ్ అధికారి చౌదరి గెలిచిన వారి పేర్లను ప్రకటించడం జరిగింది. మా ఎన్నికల తరహాలోనే రెండేళ్లకు ఒకసారి ఫిలింనగర్ కల్చర్ సెంటర్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.

నిర్మాత బండ్ల గణేష్‌కు షాక్.. - Great Telangaana Shock for producer Bandla  Ganesh!
ఇందులో మొత్తం 4600 మంది ఉండగా కేవలం 1900 మందికి మాత్రమే ఓటు హక్కు ఉన్నట్లు సమాచారం. ఇక నిన్నటి రోజున జరిగిన ఈ ఎన్నికలలో అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, డి సురేష్ బాబు మద్దతు తెలిపిన ప్యానెల్ సభ్యులు విజయవంతం సాధించారు. ఇక ఎన్నికలలో బండ్ల గణేష్ ఓటమిపాలు కావడంతో ఆయనపై పలువురు నెటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

Share post:

Latest