కొడాలి నాని రాజకీయ వారసుడు ఫిక్స్..!

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన వారసుడు ఉండటం మామూలు అయిపోయింది…తమ తర్వాత వారసులని రాజకీయాల్లోకి దింపేస్తున్నారు. వారసులు లేకపోయినా వారసురాలునైనా రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. నూటికి 90 శాతం పైనే నేతలు తమ తర్వాత వారసులని రాజకీయంగా ముందు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని వారసుడు గురించి ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అయితే ఇంతవరకు కొడాలి నాని రాజకీయ వారసుడు ఎవరు అనే చర్చ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కొడాలికి ఇంకా వయసు అవ్వలేదు…ఆయన మరో 25 ఏళ్ళు పైనే రాజకీయం చేయగలరు. పైగా ఆయన రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పక్కా ఫైర్ బ్రాండ్ నాయకుడు.

అయినా కొడాలి నాని ఉన్నంతవరకు ఆయన రాజకీయ వారసుడు ఎవరు అనే చర్చ రాకపోవచ్చు. కానీ అనూహ్యంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పరోక్షంగా తన రాజకీయ వారసుడు ఎవరో కొడాలి నాని చెప్పుకొచ్చారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారు చదువుకుంటున్నారని, వారికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, అలాగే తన భార్యకు ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో తన సోదరుడుకు ఒక కుమారుడు-ఒక కుమార్తె ఉన్నారని, అయితే తన సోదరుడు కుమారుడుకు రాజకీయాల పట్ల బాగా ఆసక్తి ఉందని, జగన్ స్పీచ్‌లు బాగా చూస్తాడని, ప్రస్తుతానికి తను చదువుకుంటున్నాడని, చదువు అయిపోయాక రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడని కొడాలి చెప్పుకొచ్చారు. అంటే రాజకీయ వారసుడుగా కొడాలి…తన సోదరుడు కుమారుడుని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటిలో మాత్రం రాజకీయ వారసుడు ఎంట్రీ ఉండటం కష్టమనే చెప్పొచ్చు. ఓ పదేళ్ళు తర్వాత కొడాలి నాని రాజకీయ వారసుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.