మెగా హీరోతో ఛాన్స్.. ఐరన్ లెగ్ ఇమేజ్ పోతుందా?

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ కేతికా శర్మ.. ఈ సినిమాలో కేతికా శర్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో నటించింది ఈ ఢిల్లీ భామ.. బాలీవుడ్ హీరోయిన్లకు పోటీగా తన అందాల విందు చేసింది. రొమాంటిక్ తో యువతకు అందాల ట్రీట్ ఇచ్చింది.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో కేతికా శర్మ అందాల ఆరబోత బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది..మొదటి సినిమానే ఫ్లాప్ కావంతో ఆమెను ఐరన్ లెగ్ అంటూ ప్రస్తావించారు. ఆ తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ సినిమాలో కేతిక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా నిరాశపరచింది. దీంతో అసలు కేతికా శర్మకు అవకాశాలు వస్తాయా? అంటూ చాలా మంది భావించారు..

కానీ ఈ రొమాంటిక్ బ్యూటీ అనూహ్యంగా మెగా హీరోతో నటించే అవకాశం వచ్చింది. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో సందడి చేసేందుకు ఈ అమ్మడి సిద్ధమైంది..ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. మరీ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.. ఈ సినిమా సక్సెస్ అయితేనే కేతికా శర్మకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం కేతికా శర్మ ఐరన్ లెగ్ బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటూ చర్చించుకుంటున్నారు..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగా వైభవంగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆవరేజ్ గా ఆడినా హీరో, హీరోయిన్ కి మంచి పేరు వస్తుందని మీడియా వర్గాలు భావిస్తున్నయి. ముఖ్యంగా కేతికా శర్మకు మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. అంతేకాదు..ఒక ఐదు సంవత్సరాల పాటు కేతికా శర్మకు సినిమాలు దక్కే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ఈ సినిమా ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి..

Share post:

Latest