నాగార్జున మాటలకు పొంగిపోయిన Jr. NTR.. విషయమిదే?

Jr ఎన్టీఆర్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా NTR పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఓ విషయం మాట్లాడటంతో NTR ఎమోషనల్ అయ్యారు.

NTR తండ్రి హరికృష్ణ నాగార్జునకు మధ్య ఎంతో మంచి సాన్నిత్యం ఉంది. నాగార్జున హరికృష్ణను అన్నయ్య అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. తాను ఎంతగానో అభిమానించే అన్నయ్య ప్రస్తుతం మన మధ్య లేరని నాగార్జున ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా తాను ఇండస్ట్రీలో అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే ఒకే ఒక వ్యక్తి హరికృష్ణ గారని అయితే తన పుట్టినరోజు తన అన్నయ్య చనిపోవడం ఎంతో బాధాకరం అంటూ హరికృష్ణ పై ఉన్న ఆప్యాయతను గుర్తు చేసుకోవడం అందరికీ విదితమే.

ఇకపోతే, సెప్టెంబర్ 2వ తేదీ బ్రహ్మాస్త్ర సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున నేడు నా అన్నయ్య హరికృష్ణ పుట్టినరోజు అంటూ హరికృష్ణ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు విన్న NTR ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇక తన తండ్రితో NTRకి ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. ఇక తన తండ్రి 66 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు.

Share post:

Latest