కేసులో ఇరుక్కొని CM పదవినే పోగొట్టుకున్న జయలలిత.. అసలు ఏమైందంటే..?

జయలలిత ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. రాజకీయాలలోకి రాకముందు తమిళ్ , తెలుగు , కన్నడ భాషలలో సుమారుగా 140కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో చాలా సినిమాలు శోభన్ బాబుతోనే కలిసి నటించడం జరిగింది. ఇక వీరిద్దరూ అలా సినిమాలలో నటిస్తున్నప్పుడే ప్రేమించుకుని , సహజీవనం చేసి ఒక పాపకు జన్మనిచ్చారట. కానీ వివాహానికి మాత్రం దూరమయ్యారు . ప్రస్తుతం వీరి కూతురు లండన్లో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే నాట్యంలో కూడా ఆమెది అందవేసిన చేయి. ఒకరకంగా తమిళ చిత్ర సీమను మకుటం లేని మహారాణిగా కొన్ని సంవత్సరాల పాటు ఏలింది. ఎంజీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ఈమె.. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆయనకు రాజకీయ సహాయకురాలిగా ఎన్నో చేసింది. చివరికి ఎంజీఆర్ మరణించిన తర్వాత ఎంజీఆర్ వారసురాలిగా ప్రకటించుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసింది.

Jayalalitha school, movies & politics entry: The journey of the real Queen  Jayalalitha: From a schoolgirl to becoming the Iron Lady of Indian politics

ఇక అలా 1991 నుంచి 1996 వరకు, 2001లో కొంతకాలం , మళ్లీ 2002 నుంచి 2006 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. మళ్లీ 2015 మే23 నుంచి 2016 డిసెంబర్లో మరణించే వరకు ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఇకపోతే పదవిలో ఉన్నప్పుడే పదవిని కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచింది జయలలిత. అసలు ఏమైంది అనే విషయానికి వస్తే 2014 సెప్టెంబర్ 27వ తేదీన జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయింది. ఇకపోతే అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఇలా ఆస్తుల కేసులో అరెస్ట్ అవడంతో పదవి కూడా రద్దయింది. ఇక పదవిలో ఉండగానే కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి కూడా జయలలిత కావడం గమనార్హం.

Was Jayalalithaa a feminist? - The Hindu
ఇకపోతే 2015 మే 11వ తేదీన కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచి పెట్టింది. తర్వాత ఆమె మే 23వ తేదీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది . ఇకపోతే 2016 డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలో తుది శ్వాస విడిచింది. అంతేకాదు సుమారుగా రెండున్నర నెలల పాటు ఆమె కోమాలో ఆసుపత్రి లో ఉండిపోయింది. ఇక జయలలిత మరణం తమిళ సినీ ఇండస్ట్రీనే కాదు తమిళనాడు రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచేసింది అని చెప్పవచ్చు.