తూర్పులో జనసేనతో భారీ మార్పులు..!

రాష్ట్రంలో జనసేన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గాని…కోస్తాలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంటుందని మొదట నుంచి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుందని గత ఎన్నికల్లో రుజువైంది. ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దీని వల్ల టీడీపీకి భారీగా నష్టం, వైసీపీకి భారీగా లాభం చేకూరింది.

ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన గాని విడిగా పోటీ చేస్తే మళ్ళీ టీడీపీకే నష్టమని విశ్లేషణలు నడుస్తున్నాయి. ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు గాని..విడివిడిగా అయితే రెండు పార్టీలకు డ్యామేజ్ జరిగి..వైసీపీకి లబ్ది చేకూరుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరిలో జనసేన ప్రభావం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దాదాపు జనసేనకు ఇక్కడ 22 శాతం ఓట్లు ఉన్నాయని, అలాగే 14 స్థానాల్లో గెలుపోటములని తారుమారు చేసే బలం జనసేనకు ఉంటుందని తేలింది.

జిల్లాలో మొత్తం 19 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 14, టీడీపీ 4, జనసేన 1 సీట్లు గెలుచుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ-జనసేన విడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీకి భారీగా లబ్ది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్తితుల్లో జనసేన 14 సీట్లలో ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, కాకినాడ రూరల్, సిటీ,  రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, పిఠాపురం, రాజోలు, జగ్గంపేట, మండపేట,  ప్రత్తిపాడు, పెద్దాపురం సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలింది.

ఈ సీట్లలో రాజమండ్రి రూరల్, రాజోలు, పిఠాపురం, కాకినాడ సిటీ సీటుల్లో జనసేన బలంగా ఉంది..అలాగే గెలుపు అవకాశాలు ఉన్నాయి. మిగిలిన సీట్లలో గెలుపోటములని తారుమారు చేయగలదు. ఒకవేళ పొత్తు లేకపోతే ఆ స్థానాల్లో టీడీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. పొత్తు ఉంటే మాత్రం ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి జనసేన వల్ల తూర్పూళో భారీ మార్పులు జరిగేలా ఉన్నాయి.

Share post:

Latest