మళ్ళీ కొత్త మంత్రులు..ఆ ఛాన్స్ ఉందా?

జగన్ మాట అంటే మాటే…ఆయన ఏదైనా చెప్పారంటే చేస్తారు..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే ఇదే అంశం మంత్రులని టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే తాజాగా కేబినెట్ సమావేశంలో జగన్…మంత్రులపై బాగా సీరియస్ అయ్యారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కామ్‌లో తెలంగాణతో పాటు. ఏపీ నేతలు కూడా ఉన్నారని ఆరోపణలుయి వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు…వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్ సతీమణి వైఎస్ భారతికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అలాగే రాష్ట్రంలో సప్లై చేసే మద్యం వైసీపీ వాళ్ళు తయారు చేసేవి అని అంటున్నారు. నాసిరకమైన జే-బ్రాండ్లు అమ్ముతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలకు వైసీపీ మహిళా నేతలు కౌంటర్లు ఇచ్చారు. మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కల్యాణిలు…టీడీపీపై ఫైర్ అయ్యారు. అసలు ఇలాంటి బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చిందే చంద్రబాబు అని అన్నారు.

అలాగే చంద్రబాబు ఫ్యామిలీ మద్యం వ్యాపారం చేస్తుందని చెప్పి భువనేశ్వరి, బ్రాహ్మణి పాల వ్యాపారం వెనుక మద్యం వ్యాపారం చేస్తున్నారని, వారు మందు తాగి గొడవలు పడుతున్నారని లేనిపోని ఆరోపణలు గుప్పించారు. కానీ టీడీపీ చేసే ఆరోపణలని తీవ్రంగా ఖండించడంలో మంత్రులు విఫలమయ్యారు. మంత్రులు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేదు.

దీనిపై జగన్…మంత్రులపై సీరియస్ అయ్యి.. . ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన కుటుంబానికి సంబంధం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేత్సున్నా, మీడియాలో కథనాలు వస్తున్నా మంత్రులు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో జే-బ్రాండ్‌ మద్యం అమ్ముతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఎదురుదాడి చేయడం లేదేం?’’ అని కేబినెట్‌లో మంత్రులపై జగన్ కోపపడినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇలాగైతే మిమ్మల్ని తీసేసి కొత్తవారికి మంత్రులుగా అవకాశమిస్తానని జగన్ అన్నట్లు తెలిసింది. ఇక దెబ్బతో మంత్రుల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇకపై సరిగ్గా కౌంటర్లు ఇవ్వకపోతే మంత్రి పదవులకు ఎసరు వచ్చేలా ఉంది. మరి చూడాలి ఇకనైనా మంత్రులు జాగ్రత్త పడతారేమో.

Share post:

Latest