జగన్ కొత్త ఎత్తు..ఆ సిట్టింగులకు చెక్?

అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయడంలో జగన్ మించిన వారు లేరనే చెప్పాలి. ఏ అంశంలోనైనా జగన్ దూకుడుగానే ముందుకెళ్తారు. నిర్ణయాలు తీసుకోవడమైన, ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టే విషయంలోనైనా జగన్ రాజకీయ విధానమే వేరు. డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలాంటి డేరింగ్ ఉన్న జగన్…తమ సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

గత కొంతకాలంగా వైసీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ సీటు ఇస్తే ఆ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం గ్యారెంటీ అని పలు సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. దాదాపు 58 స్థానాల్లోని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని పక్కన పెట్టాల్సి ఉందని ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వేలో తేలిందని ఆ మధ్య కథనాలు వచ్చాయి. సరే సర్వేలో ఎంత నిజముందో తెలియదు గాని..కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందనే మాట వాస్తవం అని వైసీపీ వర్గాల నుంచి టాక్ వస్తుంది.

దీంతో వ్యతిరేకత ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల ఉండే స్థానాల్లో అదనంగా సమన్వయకర్తలని నియమించాలని జగన్ రెడీ అయ్యారు. ఇప్పటికే తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని సమన్వయకర్తగా నియమించారు. కానీ ఈ విషయంపై శ్రీదేవి వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది. ఈ క్రమంలో జగన్ రూట్ మార్చారని, ఇలా వ్యతిరేకత ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల స్థానంలో అదనపు ఇంచార్జ్‌లని పెడితే రిస్క్ అని చెప్పి.

175 స్థానాల్లోనూ ఇంచార్జ్‌లని పెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది..బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నచోట బలహీనమైన ఇంచార్జ్‌లు, బలహీనమైన ఎమ్మెల్యేలు ఉన్నచోట బలమైన ఇంచార్జ్‌లని పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియని అమలు చేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ స్ట్రాటజీ అమలు చేస్తారా? చేస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Share post:

Latest