బాలయ్య షోకి ఆ హీరోయిన్ రాబోతోందా..?

తెలుగులో ఓటీటి వేదికగా అహ సంస్థ రావడం వల్ల పలు సినిమాలు , పలు వెబ్ సిరీస్, డ్యాన్స్ షోలతో చాలా సందడి చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ఇందులో మంచి సక్సెస్ సాధించింది. ఇక బాలకృష్ణ లోని మరొక సరికొత్త యాంగిల్ ను ఈ షో బైటికి తీయడం జరిగింది. ఇందులో స్ట్రిమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కూడా భారీగానే వ్యూస్ ను రాబట్టాయి. ఫస్ట్ సీజన్ విజయవంతంగా పూర్తి అవ్వడంతో ఇప్పుడు అందరు దృష్టి కూడా ఎక్కువగా సెకండ్ సీజన్ పైన పడింది. ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా అని బాలయ్య అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Unstoppable With NBK Season 2 Release Date, OTT, Teaser & More Details Here  - JanBharat Times
అన్ స్టాపబుల్ -2 షో త్వరలోనే ప్రారంభం కాబోతోందని నిర్వాహకుల సైతం ఇటీవల కాలంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరొకసారి బాలయ్య సరికొత్త కంటెంట్ తో రాబోతున్నారని ఆయన అభిమానులు కూడా మురిసిపోతున్నారు.ఇప్పటికే ఆహా టీమ్ ఇందుకు సంబంధించి పలు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది.అందులో భాగంగా ఒక స్పెషల్ సాంగ్ కూడా షూటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈసారి బాలయ్య షో కి ఎవరు గెస్ట్ గా వస్తారనే విషయం పలు చర్చనీయాంశంగా మారింది.

Anushka Shetty may act with balakrishna in boyapati movie ak అనుష్క మళ్లీ ఆ  హీరోతో కలిసి నటిస్తుందా ?– News18 Telugu
అన్ స్టాపబుల్ -2 లో మొదటి గెస్ట్ గా చిరంజీవి వస్తారని వార్తలు వినిపించాయి. ఇక సీజన్ ముగిసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ బివిఎస్ రవి కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ షో రెండో భాగం మొదటిలో చిరంజీవి వచ్చే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపించాయి కానీ అన్ స్టాపబుల్ -1 కు ఎక్కువ శాతం దర్శకులు హీరోలే గెస్ట్లు గా వచ్చారు. కేవలం ఇందులో రష్మిక ,ప్రగ్యా జైస్వాల్ వంటి వారు మాత్రమే సందడి చేయడం జరిగింది.అయితే ఈసారి అగ్ర హీరోయిన్ “అనుష్క శెట్టి” ని అన్ స్టాపబుల్-2 కి తీసుకురావడానికి ఆహా మేనేజ్మెంట్ పలు ప్రయత్నాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు అనుష్క కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే అధికారికంగా రావాల్సి ఉన్నది.

Share post:

Latest