రాజకీయాల్లోకి రష్మిక మందాన ఎంట్రీ.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ…?

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార రష్మిక మందన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తుందా? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నాయి తాజా వార్తలు. అసలు రష్మిక ఏంటి? రాజకీయాల్లోకి రావడం ఏంటి? అని అవాక్కవుతున్నారా! అయితే ఇప్పుడే కంగారు పడిపోకండి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికిప్పుడు పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాదట. వాస్తవానికి ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలు చేస్తూ అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటుంది.

ఇక రాజకీయాల విషయానికి వస్తే , చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమ కెరీర్ డౌన్ అవ్వగానే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. విజయశాంతి, రోజా, నగ్మా, ఖుష్బూ ఇలా చాలా మంది అలా రాజకీయాల్లో అడుగుపెట్టిన వారే. రష్మిక కూడా సినీ కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి వస్తోందని అంటున్నాడు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. ఈ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన రష్మిక మందన జాతకం చెప్పాడు. ఈ ముద్దుగుమ్మ కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుందని.. అది జరగడం ఖాయమని అంటున్నాడు.

ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళం, బాలీవుడ్ లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. షూటింగ్స్ కారణంగా క్షణం తీరిక లేకుండా ఎక్కిన ఫ్లైట్ దిగగానే మళ్లీ మరో ఫ్లైట్ ఎక్కడం అనట్లుగా ఉంది ఆమె హడావిడి. అంత బిజీగా ఉన్న రష్మిక రాజకీయాల్లోకి వెళ్లడం గురించి ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. కొంతమంది ఏమో రష్మిక ఇప్పుడే పాలిటిక్స్ లోకి వెళ్లకపోయినా ఫ్యూచర్లో వెళ్లే ఛాన్స్ ఉందేమో, అందుకే వేణు స్వామి అలా చెప్పి ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు.

Share post:

Latest