వైసీపీకి అంబటి-అమర్నాథ్ చాలు..!

మంత్రులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారు…తమ తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూ…ప్రజలకు సేవ చేస్తూ..ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి పదవి అర్ధం మారిపోయింది…మంత్రి అంటే కేవలం సంతకాలు పెట్టడానికి…అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అన్నట్లే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎప్పటినుంచో ఉంది…గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్తితే ఉండేది.

కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా పరిస్తితి మారిపోయింది. మంత్రులు అంటే ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. సరే తమ ప్రభుత్వంపై గాని, సీఎంపై గాని ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటాయి. ఆ విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇవ్వొచ్చు. కానీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం కంటే..ప్రతిపక్ష నేతలని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దీని వల్ల ప్రతిపక్షాలకు ఎంత ఇబ్బంది ఉంటుందో తెలియదు గాని..వైసీపీకి మాత్రం చాలా ఇబ్బంది.

అసలు మంత్రులు అంటే జగన్‌కు భజన చేయడం…చంద్రబాబుని తిట్టడం…లేదా పవన్‌ని తిట్టడం అన్నట్లే ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్…ఈ ఇద్దరు మంత్రులు ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతున్నారని, ఈ ఇద్దరు మంత్రులు…చంద్రబాబు-పవన్‌లని తిట్టడం కోసమే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరు ఎప్పుడు మీడియా సమావేశాల్లోనే కనిపిస్తారు…విచిత్రం ఏంటంటే…చంద్రబాబు, పవన్‌లని తిడుతూనే ఉంటారు తప్ప…వారి వారి శాఖలకు సంబంధించిన విషయాలు మాత్రం చెప్పరు.

ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే…వీరు మంత్రులు అని జనాలకు తెలుసు గాని..ఏ ఏ శాఖలకు సంబంధించిన మంత్రులు అనేది మాత్రం ప్రజలకు తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే వీరి శాఖల్లో ఏమైనా పురోగతి లేకపోయినా, లేక ఏమైనా తప్పులు జరిగినా సరే గత చంద్రబాబు ప్రభుత్వం తప్పే అని మీడియాలోకి చెబుతూ ఉంటారు. దీని వల్ల ప్రజల్లో ఇంకా చులకన అయ్యే ప్రమాదం ఉంది. అసలు మద్యపాన నిషేధం గురించి జగన్ ఏ రేంజ్ లో ప్రచారం చేశారో అందరికీ తెలుసు…కానీ ఆ మద్యపాన నిషేధంలో జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ విషయం ప్రజలకు తెలుసు…కానీ అసలు తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమే లేదని గుడివాడ అమర్నాథ్ ఆ మధ్య చెప్పారు. ఇలా చెప్పడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. మొత్తానికైతే అంబటి-అమర్నాథ్‌లతోనే వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.