ఐశ్వర్యరాయ్ చివరి చిత్రం పొన్నియన్ సెల్వనేనా..?

1990లో సినీ ప్రేక్షకులు అందరూ కూడా అభిమానించే హీరోయిన్ గా పేరు పొందింది ఐశ్వర్యరాయ్. ముఖ్యంగా ఈమె అబ్బాయిల కలల రాకుమారిగా కూడా పేరు పొందింది. అందం , అభినయంతో ఆమె తన బాడీ లాంగ్వేజ్ తో, తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే కాలం మారుతున్న కొద్ది ఆమె అందం కాస్త తగ్గిపోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వయసు పెరుగుతున్నా కూడా అందం తగ్గకుండా అలాగే తన సినీ కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఐశ్వర్యారాయ్ తన కెరీర్ ను అలాగే నెట్టుకొస్తూ ఉంది.

Aishwarya Rai ditches usual airport look, fans spot her mobile wallpaper |  Bollywood - Hindustan Times
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెను చూసిన అభిమానులు సైతం ఆమెను చూసి ఐశ్వర్య రాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసే సమయం వచ్చింది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Aishwarya Rai is a flawless beauty in red anarkali for Ponniyin Selvan 1  pre-release event: Pics, videos inside | Fashion Trends - Hindustan Times
ఎందుచేత అంటే ఐశ్వర్యారాయ్ ముఖంలో మునుపటి అందం కనిపించడం లేదు.. ఆమె శరీరంలో కూడా మునుపటి సోయగాలు కనిపించలేదు.. దీంతో ఆమె సినిమాలకు దూరమయ్యే రోజులు వచ్చాయని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో తన అందాన్ని అభిమానించిన ప్రేక్షకులు సైతం ఇప్పుడున్న ఈ అందాన్ని చూడలేకుండా ఉన్నారని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఐశ్వర్యరాయ్ కూడా ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలలోనే కనిపిస్తోంది. అయితే రాబోయే రోజులలో ఆ సినిమాలు కూడా చేయకుండా ఉండాలని కొంతమంది ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఐశ్వర్యారాయ్ ఎలాంటి పాత్రలు చేయకుండా పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పాలని కూడా మరికొంతమంది కోరుకుంటున్నారు. మిస్ ఇండియా పోటీల్లో కూడా విజయవంతం అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest