ఆసక్తి రేపుతున్న పూరీ -.ఛార్మీ గోవా ట్రిప్..!

ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజ్యాన్ని చూసిన సినిమా ఏమిటంటే లైగర్. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించినది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రొడ్యూసర్ గా ఛార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా వ్యవహరించారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.90 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదలై కనీసం రూ. 30 కోట్ల రూపాయలను కూడా రాబట్టలేకపోయింది.

Wagging tongues can't be stopped: Charmi Kaur

డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాతో చాలా లాస్ అయినట్లుగా సమాచారం. దీంతో ఈ సినిమాకి 60 కోట్ల రూపాయల వరకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కనీసం 30 కోట్ల రూపాయలైనా నష్టపరిహారం చెల్లించాలని ఛార్మి, పూరి జగన్నాథ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్లుగా సమాచారం. అయితే లైగర్ సినిమా ఫలితం తర్వాత.. వీరిద్దరూ గోవా కి వెళ్ళిపోయి అక్కడే ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫోన్ చేస్తే కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఉన్నట్లుగా తెలుస్తోంది.

20 years worth lost with one movie : Charmy Emotional
ఒకవేళ కాల్ కనెక్ట్ అయినా కూడా మీకు ఇవ్వడానికి మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదంటూ మాట దాటేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ అయితే నాకు ఏమి సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నారు. కేవలం తన తదుపరి ప్రాజెక్టు పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక పూరి జగన్నాథ్ తో జనగణమన అనే సినిమాని నటించడానికి విజయ్ దేవరకొండ గతంలో ఒప్పుకున్నారు. ఇక లైగర్ సినిమా ఫలితం చూసిన తర్వాత .. అంత భారీ బడ్జెట్ ఈ హీరోకి వర్కౌట్ అవ్వదని తెలిసి ఆ సినిమాని నిలిపివేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిన్ను కోరి సినిమా డైరెక్టర్ శివ నిర్మాణంలో ఖుషి సినిమాని చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్నది. మరి చిత్రంతోనైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Share post:

Latest