సిరిని అవమానించిన హైపర్ ఆది.. అంతా షన్నుకే ఇచ్చావు అంటూ..

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో వేసే పంచ్ లు, చేసే కామెడీ నవ్వులు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షోలలో హైపర్ ఆది వేసే పంచ్ లు మామూలుగా ఉండవు. ప్రోగ్రామ్ లో నవ్వించడం కోసం అవతలి వారిని ఏడిపించేలా లేదా అవమానపరిచేలా పంచ్ లు వేస్తుంటాడు.. హైపర్ ఆది పంచ్ లతో ఎంతో మంది సీనియర్ నటులు కూడా ఒకానొక సమయంలో అవమానించబడ్డారు.. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు కూడా హైపర్ ఆది పంచ్ ల కారణంగా అవమానానికి గురి కావాల్సి వచ్చింది..

ఈటీవీ మల్లెమాల వారు దసరా కోసం స్పెషల్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో హైపర్ ఆది తన పంచ్ లతో అందరినీ నవ్వించాడు. బిగ్ బాస్ లో నేను మీకు ఎంటర్టైన్మెంట్ అందించానని సిరి చేసిన కామెంట్స్ పై ఆది తనదైన శైలిలో కామెడీ పంచ్ వేశాడు. ‘బిగ్ బాస్ లో ఫన్ మొత్తం షన్నూకే ఇచ్చావు.. ప్రేక్షకులకు ఏమిచ్చావు’ అంటూ హైపర్ ఆది పంచ్ విసిరాడు. బిగ్ బాస్ లో సిరి, షన్నూ రిలేషన్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆ రిలేషన్ వల్ల షన్నూ బిగ్ బాస్ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే బయట మాత్రం అంతా నార్మల్ గా ఉంది. సిరి తన ప్రియుడు శ్రీహాన్ తో హ్యాపీగా ఉంది..

అయితే హైపర్ ఆది మాత్రం బిగ్ బాస్ లో జరిగిన వివాదాన్ని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో పాత విషయాలను గెలకడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫన్ మొత్తం షన్నూకే ఇచ్చావు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ లు చెప్పడం అవసరమా అంటూ అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ లో జరిగిన ఆ విషయం గురించి మాట్లాడితే సిరి బాధ పడుతుంది. ఎదుటివారిని నవ్వించడం కోసం అవతలి వారిని అవమానించడం కరెక్టేనా అంటూ నెటిజన్లు హైపర్ ఆదిని ప్రశ్నిస్తున్నారు. హైపర్ ఆది మాత్రం తగ్గేదే లా అంటూ ముందుకు సాగుతున్నాడు…

Share post:

Latest