ఫస్ట్ టైం మెగా డాటర్ ని పొగిడేస్తున్న జనాలు..అంత మంచి పని ఏం చేసిందో తెలుసా..!?

మెగా డాటర్ నిహారిక.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన తదుపరి కార్యక్రమాల గురించి.. తన బ్యూటీ గురించి.. తన అల్లరి గురించి.. జనాలకు తెలియజేస్తూనే ఉంటుంది. నాగబాబు కూతురు నిహారిక మొదట యాంకర్ గా తన సినీ కెరియర్ ని ప్రారంభించింది. ఈమె ఆ తర్వాత ఒక మనసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా మెరిసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత నిహారిక “హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం” చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇవన్నీ కూడా నిహారిక రేంజ్ కి సరిపోయే సినిమాలు కాదు. అభిమానులు ఆమెను హీరోయిన్ గా చూడలేకపోయారు. ఆ తర్వాత ఆమె ఆశ తట్టుకోలేక మళ్ళీ “సైరా నరసింహారెడ్డి” లోను ఓ పాత్రలో మెరిసింది.

కానీ ఏవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది నిహారిక. కాగా ఆఫ్టర్ మ్యారేజ్ నిహారిక లో చాలా మార్పు వచ్చింది. ఇంటిపేరు మారడంతో పాటు అమ్మడు తనదైన స్టైల్ బాడీ లాంగ్వేజ్ ని మొత్తం మార్చేసింది . పెళ్లి తర్వాత నిహారిక కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నింది. అయితే, రీసెంట్ గా మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది ఈ మెగా డాటర్.

రీసెంట్ గా నిహారిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో యాం ట్రెండింగ్ గా మారింది . అంతేకాదు ఫస్ట్ టైం నిహారిక పోస్టుకు పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అందరూ శభాష్.. సూపర్ నిహారిక అంటూ పొగిడేస్తున్నారు .ఇంతకీ అంతలా ఆమెను పొగడడానికి కారణం ఏంటో తెలుసా ..ఆమె గంగుబాయి లా మారిపోయింది. ఈ ఏడాది రిలీజ్ అయిన “గంగుబాయి కతియవాడి” సినిమా గురించి మనకు తెలిసిందే. కామాతిపురంలో వేసే వృత్తి నుంచి గ్యాంగ్ స్టార్ గా ..ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా ఎదిగిన గంగుబాయి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్ తనదైన స్టైల్ లో నటించిన మెప్పించింది.

కాగా సేమ్ అదే గెటప్ లో గంగుబాయి లుక్ లో నిహారిక అదరగొట్టింది . ఓ పార్టీలో అమ్మడు ఇలా కనిపించడం షాకింగ్ గా అనిపించింది . ఆమె కట్టు ,బొట్టు ,నడక హ్యాండ్ బ్యాగ్,లిప్ స్టిక్.. మొత్తం ఆమె మరో గంగుబాయిలనే అనిపించింది. తాజాగా ఈ ఫోటోలు నిహారిక తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోగా.. వాటికి హ్యుజ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది . అంతేకాదు నిహారిక ఇలాంటి పాత్రలకైతే సరిగ్గా సూట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

 

 

View this post on Instagram

 

A post shared by Nihaa Konidela (@niharikakonidela)